Begin typing your search above and press return to search.
వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపుతున్న యంగ్ హీరో
By: Tupaki Desk | 22 Nov 2021 5:30 PM GMTఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగిన ఈ సమయంలో బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల హీరోలు వెబ్ సిరీస్ లను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యంగ్ హీరోలు మరియు కొత్త వారికి ఓటీటీ ప్లాట్ ఫామ్ చాలా మంది అవకాశంగా నిలిచింది. కమర్షియల్ సినిమాలు థియేటర్ లో ఆడతాయి. కాని ప్రయోగాత్మకంగా ఏదైనా సినిమా చేయాలంటే మాత్రం ఓటీటీ వైపు అడుగులు పడుతున్నాయి. ఓటీటీ లో సినిమాలు విడుదల అయితే మంచి లాభాలు కూడా వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఓటీటీ కోసం సినిమా లేదా వెబ్ సిరీస్ ను చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ స్పీడ్ గా జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన మంచి కథల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఓటీటీ కి తగ్గట్లుగా మంచి కథలు ఉన్నా కూడా తాను నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. వెబ్ సిరీస్ ల్లో మాత్రమే కాకుండా వెబ్ మూవీస్ లో కూడా ఆయన నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి పాత్రతో వస్తే ఎలాంంటి కథకు అయినా ఓకే అన్నట్లుగా నితిన్ రచయితల వద్ద చెబుతున్నాడట.
వెబ్ సిరీస్ లేదా వెబ్ మూవీస్ ను తానే స్వయంగా నిర్మించేందుకు కూడా ఓకే అంటున్నాడు. మొత్తానికి ఈ యంగ్ హీరో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ప్రస్తుతం కాలం ఓటీటీ వైపులు అడుగులు వేస్తుంది. కనుక మనం కూడా అటుగా అడుగులు వేయడం మంచిదే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో హాలీవుడ్ స్టార్స్ భారీ ఎత్తున వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్న ఈ సమయంలో మన స్టార్స్ కూడా అటు వైపు అడుగులు వేస్తున్నారు. ముందు ముందు సినిమాల కంటే ఓటీటీ మార్కెట్ ఎక్కువ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నితిన్ వంటి యంగ్ స్టర్స్ ఓటీటీ కంటెంట్ ను ఇప్పటి నుండే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.