Begin typing your search above and press return to search.
అబద్దం చెప్పడానికి బడ్జెట్ పెరిగింది
By: Tupaki Desk | 28 May 2017 12:19 PM GMTటాలీవుడ్ రెండో వరస హీరోలలో తప్పకుండా చెప్పుకోవలిసిన పేరు నితిన్. కెరీర్ మొదటిలో కథ బలంతో మంచి హిట్ ట్రాక్ లో ఉన్న నితిన్.. ఆ తరవాత చాలా సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర కనీస మార్కెట్ చేయలేకపోయాయి. ఇక ఇష్క్ తో మరోసారి పేట్ మారింది కాని.. ఈ మధ్యన రెండు మూడు వరుస ఫ్లాపులతో షాక్ తినేశాడు. ఇక 'అ ఆ' సినిమాతో పర్లేదని అనిపించుకున్నాడు. ఇప్పుడు 'లై' సినిమాతో వస్తున్నాడు.
ఇక నితిన్- త్రివిక్రమ్ ‘అ..ఆ’ సినిమా బడ్జెట్ 36 కోట్ల వరకు అయ్యిందట. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద చేసిన బిజినెస్ 40 కోట్లు కాబట్టి ఆ సినిమా అలా నడిచిపోయింది. కథకు తగ్గ హీరో దానికి సరిపడే డైరెక్టర్ ఉంటే బడ్జెట్ మార్కెట్ విలువ కన్నా కాస్త ఎక్కువ పెట్టవచ్చు. ఇప్పుడు నితిన్ చేస్తున్న మరో వైవిద్యమైన కథ ‘లై’ కు కూడా అలానే మార్కెట్ కు మించి బడ్జెట్ పెడుతున్నారు. హను రాఘవపూడి డైరక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ నలభై కోట్లకు పైగానే పెట్టారట. ఈ సినిమా 80 శాతం పైగా విదేశాల్లోనే షూట్ చేశారు. సాంకేతికంగా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఇంత బడ్జెట్ పెట్టవలిసి వచ్చిందట.
ఈ మధ్య కాలంలో కేశవ.. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాలు హీరో ఇమేజ్ కన్నా కథా బలం, మేకింగ్ కొత్తదనం తోనే కాస్త పేరు తెచ్చుకుంటున్నాయి. కాని పూర్తి స్థాయిలో బడ్జెట్ ను రికవర్ చేయడానికి ఇబ్బందిపడుతున్నాయి. మరి 'లై' ఏమవుతుందంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/