Begin typing your search above and press return to search.

నితిన్ 'విక్రమ్' బిల్డప్ అవసరమా?

By:  Tupaki Desk   |   13 Aug 2022 3:58 AM GMT
నితిన్ విక్రమ్ బిల్డప్ అవసరమా?
X
యువ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి నుంచి కూడా పెద్దగా హైప్ అయితే ఏమి క్రియేట్ చేయలేకపోయింది. చాలావరకు రొటీన్ కమర్షియల్ సన్నివేశాలతో ట్రైలర్ కనిపించడంతో పూర్తి స్థాయిలో అయితే ఆడియెన్స్ థియేటర్లలోకి రావడానికి ఆసక్తి చూపించలేదు. దానికితోడు ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండడం పెద్దగా బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాధారణంగానే కొనసాగాయి. కానీ జనాలు తప్పకుండా థియేటర్లోకి వస్తారు అని మౌత్ టాక్ ఉపయోగపడుతుంది అని చిత్ర యూనిట్ బాగానే నమ్మకంతో కనిపించింది. కానీ ఈ సినిమా చూశాక ఎందుకు వెళ్లాలి అనే ఆలోచన రాకుండా ఉండదు అని కామెంట్ చేస్తున్నారు. నితిన్ ఇదివరకే వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన అపజయాలను ఎదుర్కొన్నాడు.


ఇక ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం కూడా వర్కౌట్ కాలేదు. ఊహించే సన్నివేశాలు చిరాకు తెప్పించే డైలాగ్స్ తో రోటీన్ రొమాంటిక్ సీన్స్ ఇలా అన్నీ కూడా సర్వ సాధారణం గా నే ఉండడం తో వెండితెరపై మ్యాజిక్ అయితే ఏమాత్రం క్రియేట్ అవ్వలేదు. అయితే నితిన్ కమల్ హాసన్ విక్రమ్ సినిమా మ్యూజిక్ కొంత వాడుకోవడం విశేషం.

ఇటీవలే నితిన్ సొంత బ్యానర్ లోనే కమలహాసన్ విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో సినిమా బ్యానర్ కు మంచి లాభాలు వచ్చాయి.

పెట్టిన పెట్టుబడి దాదాపు డబుల్ ప్రాఫిట్స్ అయితే వచ్చింది. అయితే ఆ సినిమా టైటిల్ ట్రాక్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు కమల్ హాసన్ బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది.

అయితే మాచర్ల నియోజకవర్గం సినిమా సెకండ్ హాఫ్ లో హీరో వార్నింగ్ ఇచ్చి తిరిగి వెళ్లే తప్పుడు విక్రమ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగానే వేశారు. అయితే కమల్ హాసన్ కు సెట్ అయినంతగా నితిన్ బాడీ లాంగ్వేజ్ కు ఏ మాత్రం సెట్ అవ్వలేదు. అనవసరంగా మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెస్ట్ చేశారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఎన్నో ఆశలు పెట్టుకున్న మాచర్ల నియోజకవర్గం మొదటిరోజు డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈ వీకెండ్ హాలిడేస్ లో సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి