Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్.. నితిన్ పెళ్లి వాయిదా?
By: Tupaki Desk | 15 March 2020 8:09 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో నితిన్ పెళ్లికి సంబంధించిన వార్తల హడావుడి ఈ మధ్యనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ లవ్వర్ బాయ్ గుట్టుగా ప్రేమలో పడటం.. పెళ్లి వరకూ వచ్చిన తర్వాత.. అది కూడా అతడికి అతడే రివీల్ చేసిన తర్వాత మాత్రమే లవ్ మ్యాటర్ బయటకు రావటం తెలిసిందే. తాను ప్రేమించిన షాలినితో పెళ్లికి సిద్ధమవుతున్న నితిన్ కు కరోనా వైరస్ ఇప్పుడు విలన్ మాదిరి మారింది.
డెస్టినేషన్ మ్యారేజ్ లో భాగంగా తన పెళ్లిని దుబాయ్ లో గ్రాండ్ గా జరపాలని డిసైడ్ కావటమే కాదు.. రెండు కుటుంబాల వారు అందుకు తగ్గ ఏర్పాట్లు ముమ్మరంగా చెప్పారు. ఏప్రిల్ 15న ప్రీ వెడ్డింగ్.. ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో విదేశీయులను పలు దేశాలు అనుమతించటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లటం అంత క్షేమకరం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో నితిన్ పెళ్లి వాయిదా తప్పదంటున్నారు. ఒకవేళ.. దుబాయ్ లో పెళ్లి కుదరకపోతే.. హైదరాబాద్ శివారులో చేయాలని భావిస్తున్నా.. ఈ నెల 31 తర్వాత మ్యారేజ్ హాళ్ల బుకింగ్స్ రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. పెళ్లి వాయిదా తప్పదంటున్నారు. కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విందులు.. వేడుకులకు దూరంగా ఉండాలని.. ఎక్కువమంది ఒకచోట చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు. ఇలాంటివేళ.. భారీగా చేపట్టాల్సిన వివాహవేడుకులకు వాయిదా మినహా మరో మార్గం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లి పోస్ట్ పోన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన నితిన్ నుంచి రాలేదు.