Begin typing your search above and press return to search.

నితిన్‌ పెళ్లి.. కీలక నిర్ణయం తీసుకున్న ఫ్యామిలీస్‌

By:  Tupaki Desk   |   20 Jun 2020 10:10 AM GMT
నితిన్‌ పెళ్లి.. కీలక నిర్ణయం తీసుకున్న ఫ్యామిలీస్‌
X
అంతా సజావుగా సాగి ఉంటే మొన్నటి ఏప్రిల్‌ లో యంగ్‌ హీరో నితిన్‌ తన ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్లు వేసేవాడు. కాని మాయదారి మహమ్మారి వైరస్‌ కారణంగా నితిన్‌ వివాహం వాయిదా వేశారు. అత్యంత వైభవంగా దుబాయిలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకున్న నితిన్‌ ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయి. ఈ ఏడాది చివర్లో ముందుగా అనుకున్న ప్రకారమే డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేయాలనుకున్న ఇరు కుటుంబ సభ్యులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో పరిస్థితులు కుదుట పడే అవకాశం లేదని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. అందుకే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లానింగ్స్‌ ను క్యాన్సిల్‌ చేసుకున్నారట. వచ్చే నెలలో హైదరాబాద్‌ శివారులోని ఒక ఫామ్‌ హౌస్‌ లో నితిన్‌ షాలినిల వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆషాడ మాసం పూర్తి అయిన వెంటనే నితిన్‌ షాలినిల వివాహంకు ముహూర్తం ఫిక్స్‌ చేశారట. త్వరలోనే ఆ వివాహ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం షూటింగ్స్‌ కూడా వెళ్లని నితిన్‌ పెళ్లి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్స్‌ కు హాజరు అయ్యేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడట. ఇటీవలే ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పరిస్థితులు ఇప్పట్లో కుదుట పడవనే ఉద్దేశ్యంతోనే మరో హీరో నిఖిల్‌ ఇప్పటికే వివాహం చేసుకున్నాడు. రానా కూడా ఇదే ఏడాదిలో పెళ్లికి సిద్దం అవుతున్నాడు.