Begin typing your search above and press return to search.

లాజిక్‌ మిస్సయ్యవమ్మా కళ్యాణ్‌

By:  Tupaki Desk   |   17 Sep 2015 11:30 AM GMT
లాజిక్‌ మిస్సయ్యవమ్మా కళ్యాణ్‌
X
పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఎగ్జాంపుల్స్ తో భలేగా చెప్తాడు. ఎక్కడా అవతలివాళ్లకు మాట్లాడే ఛాన్స్ లేకుండా.. పర్ఫెక్ట్ గా ఉంటాయి పవర్ స్టార్ కామెంట్స్. పవన్ ఫ్యాన్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతారు. మరి పవన్ కి పెద్ద ఫ్యాన్ అయిన కొరియర్ బోయ్ కళ్యాణ్ కూడా.. ఇలాంటి కామెంట్సే చేస్తాడు.

రీసెంట్ గా సినిమా టికెట్ రేట్లు పెంచడంపై నితిన్ ఓ కాఫీ కథ చెప్పాడు. ఐదు నిమిషాలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటే కాఫీ తాగితే.. 70 నుంచి వంద రూపాయల బిల్లు చెల్లించాల్సి వస్తోందన్నాడు ఈ యంగ్ హీరో. మరి రెండున్నర గంటల పాటు ఏసీ రూంలో కూర్చోబెట్టిన వినోదం పంచే మూవీకి.. 70 అంటే ఎలా అంటూ ప్రశ్నించాడు.

నితిన్ బాగానే చెప్పాడు కానీ.. వంద ఇచ్చి కాఫీ తాగేవాళ్లు వందకి 10 మంది కూడా ఉండరు. మిగతా వాళ్లంతా 10 రూపాయలిచ్చి ఇరానీ చాయ్ నో, ఆర్రూపాయలిచ్చి అల్లం టీనో తాగుతారు. 40 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే నిర్మాత.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా?