Begin typing your search above and press return to search.
యుఎస్ లో నితిన్ సినిమా మరీ ఇంతే కలెక్ట్ చేసిందా?
By: Tupaki Desk | 13 Aug 2022 5:45 AM GMTయంగ్ హీరో నితిన్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మాచార్ల నియోజక వర్గం'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ద్వారా ఎం.ఎస్. రాజశేఖరరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అత్యంత భారీ స్థాయిలో పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఇటీవల వరుసగా రంగ్ దే నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ కావడంతో నితిన్ ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నాడు.
అయితే ఆగస్టు 12న విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని నితిన్ ఎక్స్ పెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. కథ, కథనం విషయంలో దర్శకుడు చేసిన తప్పిదాలే ఈ మూవీకి శాపాలుగా మారి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేసింది. 'భీష్మ' లాంటి లవ్ స్టోరీస్ చేస్తూ హ్యాపీగా వెళుతున్న నితిన్ కెరీర్ కి 'మాచర్ల నియోజక వర్గం' పెద్ద స్పీడ్ బ్రేకర్లా మారింది.
గతంలోనూ నితిన్ ఇలాంటి రాంగ్ స్టెప్ వేయడంతో 'రామ్' అనే బిగ్ డిజాస్టర్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలో నటించిన ఈ మూవీని హైవోల్టేజ్ యాక్షన్ ఎంరటర్ టైనర్ గా చేశారు.
నితిన్ కు మాస్ ఇమేజ్ ని అందించే క్రమంలో చేసిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. తాజాగా చేసిన 'మాచర్ల నియోజక వర్గం' కూడా దాదాపు ఇదే తరహా ఫలితాన్ని అందించి నితిన్ మార్కెట్ ని యుఎస్ మార్కెట్ లో మరింతగా పతనం చేయడం గమనార్హం.
కేవలం దర్శకుడు చేసిన తప్పుల వల్లే 'మాచర్ల భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పటి వరకు నితిన్ చేసిన సినిమాలకు యుఎస్ మార్కెట్ లో మంచి వసూళ్లు దక్కాయి. కానీ మాచర్ల ఆ మార్కెట్ ని కూడా పతనం చేయడం విచారం కలిగిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. యుఎస్ మార్కెట్ లో నితిన్ నటించిన సినిమాలు మంచి వసూళ్లని రాబట్టాయి. 'లై' 56 కె, ఛల్ మోహన రంగ 142కె, 'శ్రీనివాస కల్యాణం' 63 కె, భీష్మ 95 కె, చెక్ 49 కె, రంగ్ దే 59 కె వసూలు చేశాయి.
అయితే రీసెంట్ గా విడుదలైన 'మాచర్ల నియోజక వర్గం' మాత్రం కేవలం 29కె మాత్రమే వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఈ స్థాయిలో వసూలు చేయడం దర్శకుడి తప్పిదమే అని అంటున్నారు. ఆ క్రెడిట్ దర్శకుడు ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దే అని ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఘూటగా కామెంట్ లు చేస్తుండటం గమనార్హం.