Begin typing your search above and press return to search.

ఆయనతో నితిన్ సినిమా.. పక్కా!!

By:  Tupaki Desk   |   20 Jun 2018 4:36 AM GMT
ఆయనతో నితిన్ సినిమా.. పక్కా!!
X
కెరీర్ లో డైరెక్ట్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అన్నీ డిఫరెంట్ గా.. ఓ కొత్త కాన్సెప్ట్ తో ఉండేలా సినిమాలు తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. మొదటి సినిమా అనుకోకుండా ఒక రోజు నుంచి లేటెస్ట్ గా రిలీజైన మనమంతా వరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు మంచి పేరే వచ్చింది. కాకుంటే చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు యావరేజ్ గా ఆడాయి తప్ప కమర్షియల్ హిట్లు లేవు.

దీంతో పెద్ద నిర్మాణ సంస్థలు చంద్రశేఖర్ యేలేటితో సినిమాలు తీయడానికి ముందుకు రావడం లేదు. లేటెస్ట్ గా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన మైత్రీ మూవీస్ తో ఆయనతో సినిమా తీయడానికి ప్లానింగ్ చేస్తోంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై శ్రీమంతుడు - రంగస్థలం లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. ఇటువైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేస్తూనే మరోవైపు మంచి కథాంశంతో ఉన్న వైవిధ్యమైన సినిమాలూ తీయాలని మైత్రి మూవీస్ నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అందుకే చంద్రశేఖర్ యేలేటితో తరవాత డైరెక్ట్ చేయబోయే మూవీని ఈ సంస్థే నిర్మించనుంది.

ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించనున్నాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా తీయడంలో చంద్రశేఖర్ యేలేటికి ఉన్న పట్టు తెలుసు కాబట్టి నితిన్ ఈ సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.