Begin typing your search above and press return to search.
ఈ కుర్రబ్యూటీకి మాస్ట్రోతో 'మైనస్'లే ఎక్కువగా ఉన్నాయా..??
By: Tupaki Desk | 4 Jun 2021 2:30 AM GMTఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమలో రీమేక్ మూవీస్ హవా బాగానే నడుస్తుంది. ఇప్పటికే తమిళ - మలయాళం - కన్నడ ఇండస్ట్రీల నుండి పలు సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. ప్రస్తుతం అదే కోవలో హీరో నితిన్ సినిమా కూడా తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ అవార్డు విన్నింగ్ మూవీ 'అంధాధున్' సినిమాను నితిన్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్సప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నభానటేష్ నటిస్తోంది.
ఇప్పటికే వీరిద్దరి మధ్య మాంచి కెమిస్ట్రీ బాగా కుదిరిందని టాక్. అలాగే వీరిద్దరూ రొమాంటిక్ సన్నివేశాలలో కూడా చాలా లీనమై నటించినట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ థ్రిల్లర్ సినిమాలో కీలకమైన బోల్డ్ టబు క్యారెక్టర్ పై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. కాస్త నెగటివ్ టచ్ ఉన్న రొమాంటిక్ క్యారెక్టర్ అది. మొత్తానికి ఈ బోల్డ్ క్యారెక్టర్ లో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. ఆ పాత్రకోసం తమన్నా పారితోషికం కూడా భారీగానే తీసుకుందని ఇండస్ట్రీవర్గాలలో టాక్. అయితే ఈ సినిమాకు మాస్ట్రో అనే టైటిల్ ఖరారు అయిన విషయం విదితమే.
ఈ సినిమాలో నితిన్ ఛాలెంజింగ్ బ్లైండ్ రోల్ చేస్తున్నాడు. ఇటీవలే చెక్ సినిమాతో ప్లాప్ అందుకున్న నితిన్ ఆ వెంటనే రంగ్ దే సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే నిజానికి మాస్ట్రో సినిమా పూర్తిగా హీరో నితిన్ - తమన్నా క్యారెక్టర్స్ పై రన్ అవుతుంది. మరి ఇప్పుడు కుర్రహీరోయిన్ నభా పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంధదున్ సినిమాలో హీరో అండ్ టబు క్యారెక్టర్ పై స్టోరీ నడుస్తుంది. హీరోయిన్ గా చేసినటువంటి రాధికా ఆప్టేకు సినిమా ఎలాంటి గుర్తింపు తేలేదు. మరి ఆ రోల్ తెలుగులో డెవలప్ చేసారా లేకపోతే అలాగే ఫాలో అయిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ తెలుగులో క్యారెక్టర్ స్కోప్ పెంచినట్లయితే నభాకు ప్లస్ అవుతుంది. లేదంటే నభాకు మాస్ట్రోతో ఎలాంటి గుర్తింపు దక్కదని ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి.