Begin typing your search above and press return to search.

మాస్క్ ధరించి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట!

By:  Tupaki Desk   |   12 April 2020 8:57 AM GMT
మాస్క్ ధరించి పెళ్లి  చేసుకునే ఉద్దేశం లేదట!
X
యువ హీరో నితిన్ కొన్ని వరస ఫ్లాపుల తర్వాత 'భీష్మ' సినిమా విజయంతో రీఛార్జ్ అయ్యాడు. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. అంతా హ్యాపీస్ అనుకునే టైమ్ లో కరోనావైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ కారణంగా ప్లాన్లన్నీ ఉల్టాపల్టా అయ్యాయి. నిజానికి ఈ నెల 15 వ తారీఖున దుబాయిలో నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్ జరగాల్సి ఉందట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా అది క్యాన్సిల్ అయింది. వివాహం కూడా వాయిదా వేసుకున్నారు.

అయితే ఈ విషయంలో నితిన్ పెద్దగా టెన్షన్ పడడం లేదట. "లాక్ డౌన్ ప్రకటించగానే నా పెళ్లి వాయిదా వేయాలని నిర్ణయించకున్నాను. మా కుటుంబ సభ్యులు. షాలిని కుటుంబ సభ్యులు కూడా అందుకు ఒప్పుకున్నారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ పెద్ద వేడుక. కానీ మన ప్రాణాల కంటే మరేదీ ముఖ్యం కాదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే.. నేను మాస్క్ వేసుకుని పెళ్లి చేసుకోదలుచుకోలేదు" అంటూ తన అభిప్రాయం చెప్పాడు నితిన్.

కరోనావైరస్ ను అదుపులోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను తెలంగాణాప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చక్కబడిన తర్వాతే నితిన్ మ్యారేజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కరోనా బాధితుల సహాయార్థం తెలంగాణా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నితిన్ చెరో 20 లక్షలు విరాళం ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నాడు.