Begin typing your search above and press return to search.
ఆ విషయంలో నితిన్ 'అబద్ధ'మాడడట!
By: Tupaki Desk | 8 Aug 2017 8:43 AM GMTతేజ దర్శకత్వంలో జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నితిన్. జయం తర్వాత కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నాడు. కథల ఎంపికలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకున్న తర్వాత విజయాలు వరించాయి. ‘అఆ’తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నితిన్ ఈ నెల 11న లైతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో మాత్రం తెగ అబద్ధాలు ఆడానని - నిజ జీవితంలో అమ్మాయిల విషయంలో మాత్రం అబద్ధమాడనని చెప్పాడు నితిన్. లై విడుదల నేపథ్యంలో నితిన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు నితిన్ మాట్లలోనే....
నేను కూడా కాలేజీకని చెప్పి సినిమాకి వెళ్లడం - ఎక్సామ్ మార్క్స్ రాలేదని చెప్పడం వంటి అబద్ధాలు ఆడాను. కాకపోతే అమ్మాయిల విషయంలో మాత్రం నేనెప్పుడూ అబద్ధాలు చెప్పను. కనీసం ప్రేమ విషయంలోనైనా నిజాయతీగా ఉండాలనేది నా అభిప్రాయం. లై సినిమాలో అబద్ధాలతో పాటు - చాలా విషయాలుంటాయి. విలన్ కు - హీరోకి మధ్య సాగే మైండ్ గేమ్ - డ్రామా ప్రేక్షకుల మెదడుకి పనిపెడుతుంది. అర్జున్ ఈ సినిమాకి చాలా ప్లస్సయ్యారు. లై సినిమాలో ఎ.సత్యం(అసత్యం) అనే ఓ ఆవారా పాత్రలో కనిపిస్తా. అమెరికా వెళ్లి బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని, అక్కడే సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉన్న పాత్ర అది.
‘అఆ’ తర్వాత 6 నెలల పాటు ఖాళీగా ఉన్నా. ‘హిట్టిచ్చారు కానీ... ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేకపోతున్నా’ అని మా గురూజీ త్రివిక్రమ్ గారితో చెప్పా. ‘‘ఇష్క్’ నుంచి సున్నితమైన ప్రేమ కథల్లోనే నటిస్తున్నావు కదా... ఈసారి మాత్రం అలాంటి సినిమా చేయొద్దు - అదే ముద్ర పడిపోయే ప్రమాదం ఉంటుంద’’ని చెప్పారు. హను రాఘవపూడి ‘లై’ కథ నచ్చడంతో ‘అబద్ధ’ మాడాలని నిర్ణయించుకొన్నా.
ఈ సినిమా కోసం జీవితంలో మొదటి సారి అంత గెడ్డం పెంచా. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాల్సి ఉంటుంది. నాకూ సూట్ అయ్యే యాక్షన్ మూవీ లై.
పవన్ కల్యాణ్ ని చూసి నటన నేర్చుకున్నాను. జయం ఆడిషన్స్ లో కూడా ఆయన సీన్స్ ను ఇమిటేట్ చేశా. పవన్ కల్యాణ్ పై నాకున్న ప్రేమని నా ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక చోట చూపిస్తుంటా. ‘లై’లోని బొంబాట్ పాటలో తమ్ముడు సినిమాలో పవన్ కల్యాణ్ లా కూలీ గెటప్పులో కనిపిస్తా. పవన్ కల్యాణ్ ని కలిసినప్పుడు నేను పెద్దగా మాట్లాడను. ఆయన మాట్లాడుతుంటారు - నేను వింటుంటానంతే. ఎప్పుడైనా కలిసినప్పుడు ‘ఈ లుక్ లో బాగున్నావు - సినిమా కోసమేనా?’ అని అడుగుతుంటారంతే.
వరుస ఫ్లాప్ లు వస్తే హీరోలు వ్యసనాలకి బానిసలవుతారనేది నేను నమ్మను.పరాజయాలు ఎదురవుతున్నప్పుడు ఇంకా కసితో పనిచేసేవాణ్ని. కష్టపడి ఎయిట్ ప్యాక్ సాధించాను. డ్యాన్స్ చేసి ఫ్లోర్లన్నీ ఊడ్చేశాను. వరుస విజయాలు వచ్చినపుడు తర్వాతి సినిమాల గురించి ఆచితూచి అడుగేయాలి. పరాజయాలున్నపుడు తర్వాతి సినిమా ఎలాగోలా గట్టెక్కితే చాలనే ధోరణిలో ఉంటాం. కృష్ణచైతన్య దర్శకత్వంలో నా 25వ సినిమా రాబోతోంది. పవన్ గారు నిర్మిస్తున్న మొదటి సినిమా అదే కావడం నా లక్. పవన్ అభిమానిగా నాకు అంతకంటే సంతోషమైన విషయం ఏదీ లేదు.