Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ నా దేవుడు

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:18 PM
పవన్ కళ్యాణ్ నా దేవుడు
X
సినిమా హీరోలుకు అభిమానులు ఉంటారు. మన హీరోలు కూడా ఎవరికో ఒకరికి అభిమానులై ఉంటారు. ఎందుకంటే మనం సినిమాలు చేసి ఎలా ఎంజాయ్ చేస్తామో వాళ్ళు కూడా అలానే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. ఒక మాస్ హీరోని చూసి కొంతమంది హీరోలు అయినవారు ఉన్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలుగు ప్రజలకు స్పెషల్ గా చెప్పే పనిలేదు. అటువంటి పవన్ కు మన యంగ్ హీరోలలో చాలా మంది అభిమానులు ఉన్నారు మరి ముఖ్యంగా హీరో నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో చెప్పకర్లేదు.నితిన్ అంటే కూడా పవన్ కళ్యాణ్ కు అంతే అభిమానం ప్రేమ. కేవలం నితిన్ ఫిల్మ్ ఫంక్షన్ అని తెలిసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి.

నితిన్ ఇప్పుడు తన తాజా సినిమా లై సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్నాడు. ఒక మీడియా ఇంటర్వ్యూ లో మీరు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్టైల్ ని కొన్ని భావ ప్రకటనను కాపీ చేస్తారా కదా? అనే ప్రశ్న వేశారు. దానికి నితిన్ ఇలా అంటున్నాడు. “సినిమాలలో నాకు దేవుడు లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయన సినిమాలు చూస్తూ నటనను నేర్చుకున్నాను. నాకు నటనలో ప్రేరణ ఎవరైనా ఇచ్చారు అంటే అది నా బాస్ పవన్ కళ్యాణ్ గారే. ఇంకా లై సినిమాలో ‘బంబాట్’ అనే పాట తమ్ముడు సినిమాలో ‘వయ్యారి భామ’ పాటను స్ఫూర్తిగా తీసుకొని చేశాము'' అని చెప్పాడు. ''ఇంకా నా ముందు రాబోతున్న సినిమాలులో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నవి నాకు బాగా నచ్చినవి వాడతాను'' అని చెబుతున్నాడు నితిన్. అలాగే త్రివిక్రమ్ చెప్పాడట.. మంచి కథలు కొత్త కథలు ఎంచుకో అవి నిన్ను మంచి హీరోని చేస్తాయి అని.. సో నితిన్ అదే సలహాను పాటిస్తున్నాడట.

పవన్ కళ్యాణ్ కి నితిన్ అంటే ఒక అభిమానిగా కాకుండా ఒక వ్యక్తిగా చాలా ఇష్టం. నితిన్ రాబోతున్న ఒక సినిమాకు పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కలిసి నిర్మాతగా ఉంటున్నారు.