Begin typing your search above and press return to search.

25 అనుకుంటే 41 అయిందా?

By:  Tupaki Desk   |   17 Sep 2015 1:30 AM GMT
25 అనుకుంటే 41 అయిందా?
X
నాగ్ తనయుడు అఖిల్ లాంఛింగ్ మూవీని ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు నిర్మాత అవతారమెత్తిన నితిన్. అక్కినేని వంశంలో కొత్త వారసుడిని పరిచయం చేసేందుకు.. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. కేరక్టర్ లు, షూటింగ్ స్పాట్ లు, లొకేషన్ లు.. ఎందులోనూ కొంచెం కూడా తగ్గడం లేదు కొరియర్ బాయ్.

వినాయక్ డైరెక్షన్ అంటే.. బడ్జెట్ దిట్టంగానే అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. మనోడు పైకి లేపే సుమోల రేంజ్‌ లో... బడ్జెట్ గ్రాఫ్ పెరుగుతుంది. మామూలుగానే భారీ సినిమాల డైరెక్టర్. మరి ఇప్పుడు అఖిల్ లాంటి ఎనర్జిటిక్ పర్సన్ ని లాంఛ్ చేయడం, ఆ మూవీకి నితిన్ లాంటి కండిషన్స్ పెట్టుకోని నిర్మాత దొరకడంతో.. ఇక టాప్ గేర్ లోకి వెళ్లిపోయాడట వినాయక్. అఖిల్ కోసం మొదట పాతిక కోట్ల బడ్జెట్ అనుకున్నారట. అయితే.. ఇప్పిటికే 40 దాటేసిందని టాక్ వినిపిస్తోంది. ఖర్చు ఎక్కువైన విషయం నితిన్ ఒప్పుకుంటున్నాడు కూడా. అయితే.. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు అనేక దేశాల్లో షూటింగ్ చేశామని, అయినా లెక్కలు చూసుకోవడం లేదని చెప్పకొచ్చాడు కుర్రాడు.

బడ్జెట్ ఎంత.. రిటర్న్ ఎంత అన్న లెక్కలపైనే హిట్టా ఫట్టా అని తేల్చే రోజులివి. అల్లుడు శీను లాంటి సినిమాకి 20 కోట్ల పైగానే వచ్చినా.. ఫ్లాప్ అనాల్సి వచ్చింది. కొత్త హీరోకి ఇది చాలా ఎక్కువ నిజానికి. ఇప్పుడు అఖిల్ మూవీ కనీసం 50 కోట్ల బిజినెస్ ఈజీగా చేసేస్తుంది. అలాగని అంతేనో, అంతకు 2-3 తగ్గితేనో ఫ్లాప్ అనేస్తారు. అందుకే ఇప్పుడు అఖిల్ కి బాధ్యత పెరిగిపోయింది. ఈ లెక్కల ప్రకారం 42 కోట్లు షేర్‌ కొల్లగొడితేనే.. హిట్ అనాల్సి వస్తుందేమో.