Begin typing your search above and press return to search.

అప్పుడే మాటలిచ్చుకు కొట్టేస్తున్నాడే...?

By:  Tupaki Desk   |   16 Sep 2015 5:26 AM GMT
అప్పుడే మాటలిచ్చుకు కొట్టేస్తున్నాడే...?
X
ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. అంటే సావాసగాళ్ళ ప్రభావం ఆ రేంజ్ లో వుంటున్నదన్నమాట. నితిన్ త్రివిక్రమ్ సినిమా ఈ మధ్యనే కన్ఫర్మ్ అయింది. అయితే నితిన్ మాటల మాంత్రికుడితో ముందు నుండే సావాసం చేస్తున్నాడో లేదా ఆయన సినిమాలు చూసి మామూలు ప్రేక్షకుల లానే పంచ్ లు వేయడం నేర్చుకున్నాడో గానీ కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా మీడియా సమావేశంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా భలే పంచ్ ఇచ్చాడు. అదేమిటంటే...

మీరు నిర్మాతగా చేస్తున్న సినిమా అఖిల్, బ్రూస్ లీ వారం వ్యవధిలో విడుదలవుతున్నాయి, వారం వ్యవధిలో సినిమా అంటే బ్లాక్ మార్కెట్ దే రాజ్యం..? అనగా.. బ్లాక్ మార్కెట్ అనేది మన పరిధిలో లేదు అంటూనే కాఫీ షాప్ కి వెళ్లి 5 నిముషాల్లో ఓ కాఫీ తాగినందుకే వందకుపైగా చెల్లించుకోవాలి.. అలాంటిది రెండున్నర గంటల సినిమా, కాఫీ కంటే చౌకగా దొరకాలా...? అని నిర్మాతగా సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశాడు. అయితే నితిన్ భయ్యా ఇక్కడ గుర్తించాల్సిన విషయం మరోటుంది. పేక్షకులందరూ కాఫీ షాప్ కి వెళ్లి నూరు, నూట యాభై విలువ చేసి కాఫీ తాగి టిప్ కింద మరో వంద క్షవరం చేసుకునే రకం కాదు. బ్లాక్ లో కొనడం ఇష్టంలేక అదే సొమ్ముతో మల్టీప్లెక్స్ లో టికెట్ బుక్ చేసుకునే వారు మధ్యలో పాప్ కార్న్ కొన(లే)రు నితిన్ గారు. చివరాఖరు విషయం ఏమిటంటే పంచ్ బాగుంది కానీ.. కాస్త అర్థవంతంగా వుంటే మరింత బావుండేది..!