Begin typing your search above and press return to search.

తొందరపడి పెంచేయకు నితిన్ బాబూ

By:  Tupaki Desk   |   9 Jun 2016 11:34 AM GMT
తొందరపడి పెంచేయకు నితిన్ బాబూ
X

ఏదో సింపుల్‌ సినిమా అనుకుంటే.. రిలీజయ్యి హిట్టయ్యాక కొన్ని సినిమాల రేంజ్ అమాంతంగా మారిపోతుంది. అదిగో ''అ..ఆ'' సినిమా పరిస్థితి అంతే. సినిమా తొలి వీక్ పూర్తయ్యేసరికి ఏకంగా 50 కోట్ల గ్రాస్‌ (33 కోట్ల షేర్‌) వసూలు చేసింది. ఇప్పటివరకు కేవలం 20 కోట్ల మార్కెట్ ఉన్న నితిన్‌.. ఇప్పుడు తన మార్కెట్‌ ఎంత పెరిగిందని అనుకుంటున్నాడు? ఇదే అసలు చూసుకోవాల్సిన విషయం.

ఈ మధ్య కాలంలో హీరో నాని విషయం తీసుకుంటే.. మనోడు ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు 25 కోట్లు షేర్‌ రావడంతో.. వెంటనే ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమా కోసం కాస్త ఎక్కువగానే పెట్టేశారు. కాని రిజల్టు చూస్తే అనుకున్నంత గొప్పగా లేదు. కొత్తగా క్రియేట్‌ అయిన 25 కోట్ల మార్కెట్‌ ను నాని సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు 'జెంటిల్మన్' ఎంత తెస్తుందో చూసి మనం ఒక ఫిగర్‌ అనేది చెప్పొచ్చు. మరి నితిన్‌ పరిస్థితి కూడా అలాగే ఉంటుందిగా. అ..ఆ సినిమా ఒక 50+ కోట్ల షేర్‌ తెచ్చినా కూడా.. అదంతా నితిన్ క్రెడిట్‌ లో పడదు కాబట్టి.. తాను కొత్తగా తీయబోయే సినిమా తాలూకు బడ్జెట్‌ ను గతంలో తనకున్న 20 కోట్ల మార్కెట్‌ కే టార్గెట్‌ చేయడం కరక్టు అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

'నేను శైలజ' ఫేం కిషోర్ తిరుమల డైరక్షన్ లో ఇప్పుడు నితిన్ తన కొత్త సినిమాను మొదలెట్టబోతున్నాడు. అది సంగతి.