Begin typing your search above and press return to search.
నితిన్.. అతను బూతులేనట
By: Tupaki Desk | 6 Aug 2017 10:00 AM GMTతన కొత్త సినిమా ‘లై’ దర్శకుడు హను రాఘవపూడిపై ప్రశంసలు కురిపించాడు నితిన్. అతడిలా సినిమా కోసం కష్టపడే దర్శకుడిని తాను చూడలేదని అన్నాడు నితిన్. ‘లై’ సినిమా కోసం హను విపరీతంగా శ్రమించాడని అతనన్నాడు. ‘‘హను ‘లై’ సినిమా మొదలయ్యే సమయానికి నన్ను సార్ అనేవాడు. నేను కూడా సార్ అనేవాడిని. తర్వాత తర్వాత ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఇద్దరం బూతులే మాట్లాడుకుంటున్నాం. తిట్టుకుంటున్నాం. హను ‘లై’ కోసం ఎంత కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేను. ఈ సినిమా కోసం అమెరికా షెడ్యూల్ 75 రోజుల పాటు సాగింది. ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కు వీసా దొరకలేదు. ఆర్ట్ డైరెక్టర్ కు కూడా అలాంటి సమస్యే ఎదురై అమెరికాకు రాలేకపోయాడు.
అలాంటి సమయంలో అసిస్టెంట్ లేకుండా.. ఆర్ట్ డైరెక్టర్ లేకుండా మొత్తం పని తనే చూసుకున్నాడు హను. ఆ షెడ్యూల్ జరిగినంత కాలం అతను రోజులో గరిష్టంగా 3 గంటలు పడుకుని ఉంటాడు. పగలూ రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు. ఈ సినిమా చేస్తున్నపుడే హను భార్య ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యాక ఏ అమ్మాయైనా తన భర్త పక్కనే ఉండాలనుకుంటుంది. కానీ హను మాతో షూటింగులో ఉండిపోయాడు. తన భార్య ఎంత బాధపడి ఉంటుందో మేం అర్థం చేసుకోగలం. సినిమా అంటే హనుకు ఎంత పిచ్చో ‘లై’ చేస్తున్నపుడు తెలిసింది. అతడి కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమా ఇస్తుంది’’ అని నితిన్ అన్నాడు. ఇక తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ‘‘ఆయన నిర్మాతా మారి తీస్తున్న తొలి సినిమా.. నా కెరీర్లో 25వ సినిమా. ఓ అభిమానిగా ఇంతకంటే ఏం కోరుకుంటాను’’ అన్నాడు నితిన్.