Begin typing your search above and press return to search.

నెలాఖ‌రున నితిన్‌ ఏం చెబుతాడో?

By:  Tupaki Desk   |   6 March 2019 3:30 PM GMT
నెలాఖ‌రున నితిన్‌ ఏం చెబుతాడో?
X
యంగ్ హీరో నితిన్ న‌టించిన `శ్రీ‌నివాస క‌ళ్యాణం` గ‌త ఏడాది రిలీజై డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. `లై` త‌ర్వాత వెంట‌నే `శ్రీ‌నివాస క‌ళ్యాణం` ఇచ్చిన జోల్ట్ ఈ కుర్ర‌హీరోని కోలుకోనివ్వ‌లేదు. వ‌రుస త‌ప్పిదాలు చాలానే ఆలోచించుకునేలా చేశాయి. అందుకే ఇటీవ‌ల‌ సైటెంట్ గానే ఉన్నాడు. భీష్మ అనే చిత్రంలో న‌టించ‌నున్నాడ‌ని - ప్రీప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంద‌ని ఇటీవ‌ల వ‌ర్త‌లు వ‌చ్చినా నితిన్ అధికారికంగా ఏదీ చెప్ప‌లేదు.

అయితే ఇంత కాలంగా అత‌డి నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేక‌పోవ‌డంతో అభిమానులు అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. ఆ అస‌హ‌నాన్ని నేరుగా సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానులు బ‌య‌ట పెట్టేస్తున్నారు. దీంతో నితిన్ నేరుగా లైన్ లో కొచ్చారు. `ఈ నెలాఖరులో చెప్పేస్తా.. ప్రామిస్` అంటూ అభిమానులకు మాటిచ్చేసారు. భీష్మ‌తో పాటు మ‌రో స్క్రిప్టు ప్ర‌స్తుతం రెడీ అవుతున్నాయని వీటి వివ‌రాల్ని మార్చి చివ‌రిలో ప్ర‌క‌టించేస్తాన‌ని తెలిపాడు. ప్రస్తుతం నేను ఒప్పుకొన్న ప్రాజెక్ట్‌ లన్నీ స్క్రిప్టింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఈ ఏడాది రెండు సినిమాలతో మీ ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను. ఆలస్యమైనందుకు క్ష‌మించండి అని నితిన్ అభిమానుల‌ను కోరారు. మీరు ఇంతకాలం ఓపిక పట్టినందుకు ధన్యవాదాలు. లవ్యూ ఆల్ .. అని పేర్కొన్నారు.

భీష్మ చిత్రంలో క‌థానాయిక‌గా ఇప్ప‌టికే రష్మిక మందనను ఫైన‌ల్ చేశారు. ఈ చిత్రానికి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించబోతున్నారు. మ‌రిన్ని వివ‌రాలు నెలాఖ‌రున తెలియ‌నున్నాయి. మ‌రో కొత్త ప్రాజెక్టు క‌థ ఎలా ఉంటుందో రివీల్ కావాల్సి ఉందింకా. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో ఒక‌డిగ ఓ వెలుగు వెలిగిన నితిన్ కి 2019 -20 సీజ‌న్ అయినా క‌లిసొస్తుందేమో చూడాలి. ఇష్క్‌ - గుండె జారి గ‌ల్లంత‌య్యిందే లాంటి భారీ హిట్లు వ‌స్తేనే మ‌ళ్లీ కుర్రాడిలో జోష్ వ‌స్తుంది.