Begin typing your search above and press return to search.
అమెరికాలో రంగ్ దే ప్రీమియర్ల ఘనత
By: Tupaki Desk | 26 March 2021 6:00 AM ISTటాలీవుడ్ కి అమెరికా మార్కెట్ చాలా ఇంపార్టెంట్. అందుకే అక్కడ ప్రీమియర్లు సహా ప్రతిదీ ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇటీవల రిలీజైన జాతిరత్నాలు అమెరికాలోనూ ఘనవిజయం సాధించింది. కరోనా క్రైసిస్ తర్వాత చిన్న సినిమాగా వచ్చి విదేశాల్లో పెద్ద విజయం అందుకోవడం పరిశ్రమకు కొత్త ఆశల్ని నింపింది.
అమెరికా సహా విదేశాలలో జాతి రత్నలు సాధించిన విజయం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఇతర చిత్రాల నిర్మాతలకు ఊపిరులూదింది. నితిన్ - కీర్తి సురేష్ నటించిన రంగ్ దే విదేశాల్లో భారీగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంపై అంచనాలు బావున్నాయి. దీంతో ముందస్తు బుకింగ్ లకు డిమాండ్ నెలకొందట.
కేవలం అమెరికాలో పెద్ద స్థాయిలో ప్రీమియర్లకు ప్లాన్ చేశారని తెలిసింది. 100K డాలర్ల రేంజు కనిపిస్తోందట. ఇటీవల ఈ ఘనత సాధించిన ఏకైక చిత్రం జాతి రత్నలు. రంగ్ దే కుటుంబ కథ.. లవ్ రొమాన్స్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తోంది కాబట్టి యూత్ లో క్రేజు నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలవుతున్న రంగ్ దే ఇక్కడా ఓపెనింగుల రికార్డులు సాధిస్తుందని భావిస్తున్నారు. అమెరికా సహా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లోనూ రంగ్ దే రిలీజవుతోంది.