Begin typing your search above and press return to search.
నితిన్ 'ఐ మిస్ యు' ఎవరికి చెప్పాడంటే
By: Tupaki Desk | 3 Jun 2016 4:59 AM GMTడైరెక్టర్ తో హీరోకి ఎఫైర్ అంటే.. ఓ లేడీ డైరెక్టర్, హీరో అనుకోకండి. త్రివిక్రమ్ తో సినిమా చేశాక.. ఆయనతో లవ్ లో పడిపోయా అంటూ నితిన్ ఆడియో ఫంక్షన్ సాక్షిగా చెప్పేశాడు. అప్పుడే ఐ లవ్యూ కూడా చెప్పాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు తన ఇష్టాన్ని మళ్లీ కూడా చెబుతున్నాడు. అయితే.. ఇప్పటికే ఐ మిస్ యు కూడా చెప్పేసుకున్నారట వీళ్లిద్దరూ.
'అ..ఆ.. ఆఖరి రోజు షూటింగ్ అయ్యాక నేను త్రివిక్రమ్ గారికి ఐ మిస్ యు అని మెసేజ్ చేశాను. ఆయన నుంచి వెంటనే ఐ మిస్ యు టూ' అని రిప్లై వచ్చింది. అసలు ఈ సినిమాలో చేయమని కాల్ వచ్చినపుడే.. అదో లవ్ ప్రపోజల్ లా అనిపించిందట ఈ హీరోకి. 'హీరోగా - నిర్మాతగా నేను కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కున్న పరిస్థితి. అలాంటి సమయంలో నా ఫేవరేట్ డైరెక్టర్ నుంచి కాల్ రావడంతో చాలా థ్రిల్ అయ్యాను' అని చెప్పాడు నితిన్.
అ..ఆ.. లో తను చేసిన అన్ని సీన్స్ లోకి 'లవ్ చేసేంత లగ్జరీ లేదు.. వదిలేసే అంత లెవెల్ లేదు' అనే డైలాగ్ చాలా కష్టంగా అనిపించిందన్నాడు నితిన్. ట్రైలర్ లో సాధారణంగా అనిపించే ఈ డైలాగ్ చేయడం కోసం.. ఆ పాత్ర పడే స్ట్రగుల్ ని దగ్గరుండి మరీ వివరించాడట త్రివిక్రమ్. అలా ఈ మూవీకోసం తనను త్రివిక్రమ్ ఎన్నో రకాలు సిద్ధం చేశాడని చెప్పాడీ కుర్ర హీరో. మూవీ షూటింగ్ అయిపోయాక.. 'ఇది ఇక్కడితో ఎందుకైపోవాలి.. వెంటనే సీక్వెల్ స్టార్ట్ చేద్దాం' అన్నాడట కూడా. అయినా సరే.. తన ఫ్రెండ్ - ఫిలాసఫర్ తో విడిపోక తప్పలేదంటున్నాడు నితిన్.