Begin typing your search above and press return to search.
25వ సినిమా నాకు గొప్ప కాదు: నితిన్
By: Tupaki Desk | 25 March 2018 5:23 PM GMTచల్ మోహనరంగా వేడుకలో నితిన్ ఎమోషనల్ గా బాగా ఎగ్జైట్ అయ్యాడు. కారణం పవన్ కళ్యాణ్ రావడం అనే కాక తన పాతికవ సినిమాకు తండ్రితో పాటు పవర్ స్టార్ నిర్మాతగా వ్యవహరించడం నితిన్ ని ఉద్వేగానికి గురి చేసింది. అది అతని మాటల్లో బయట పడింది కూడా. 16 ఏళ్ళలో 25 సినిమాలు చేయటం తనకేమి గర్వకారణంగా లేదని చెప్పిన నితిన్ తన సినిమాకు పవన్ నిర్మాత కావడం పట్ల సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అన్నాడు. సినిమా జీవితం పరంగా తాను త్రివిక్రమ్ కు కరుణాకరన్ కు థాంక్స్ చెప్పాలని, అతడు-తొలిప్రేమ సినిమాలు చూసే తనకు పరిశ్రమకు రావాలన్న కోరిక కలిగిందన్న నితిన్ తనను తండ్రి సుధాకర్ రెడ్డి వద్దనకుండా ప్రోత్సహించి దీనికైనా పనికి వస్తానని గుర్తించినందుకు ఆయనకు థాంక్స్ చెప్పాడు. సినిమాలో నటించిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పిన నితిన్ పవన్ మీదున్న ప్రత్యేక అభిమానాన్ని మాత్రం మరోసారి చాటుకున్నాడు.
త్రివిక్రమ్ ను తానెంతో అభిమానిస్తానని, ఆయన స్ఫూర్తితోనే ఇక్కడి దాకా వచ్చానన్న నితిన్ ఒకవేళ మగవాళ్ళకు ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేయాల్సి వస్తే ముందు త్రివిక్రమ్ కే చెబుతానని చెప్పి చిన్న స్వీట్ షాక్ ఇచ్చాడు. పవన్ సినిమాలను తాను ఎంత కష్టపడి చూసింది టికెట్ల కోసం చేసిన యుద్ధాలు బ్యానర్లు కట్టడం అంతా ఫాన్స్ కు జోష్ ఇచ్చేలా ఆద్యంతం నితిన్ తన ప్రేమను బయట పెట్టాడు. మొత్తానికి పవన్ కు తాను ఎమోషనల్ గా ఎంత కనెక్ట్ అయ్యున్నాడు అనేది మరోసారి చల్ మోహనరంగా వేడుకలో నితిన్ చూపించేసాడు. ఎక్కువ సేపు మాట్లాడకుండా ఏడు నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించిన నితిన్ సినిమా మీద మాత్రం చాలా కాన్ఫిడెన్స్ చూపించాడు. విజయం సాధించడం ఖాయమని ఏప్రిల్ 5 థియేటర్లలో చూసి ఆశీర్వదించమని కోరాడు. మరికాసేపు మాట్లాడేవాడేమో కాని ఉద్వేగం నితిన్ ను ఎక్కువ సేపు ఉంచలేకపోయింది.పవన్ ని స్టేజి పైకి రమ్మని పిలిచి అక్కడితో తన ప్రసంగాన్ని ముగించిన నితిన్ సినిమాపై అంచనాలు పెంచేసాడు.