Begin typing your search above and press return to search.
నితిన్ కుర్తా ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!
By: Tupaki Desk | 25 July 2020 4:30 PM GMTటాలీవుడ్ యువ హీరో నితిన్ - షాలినిల వివాహ వేడుక ఈ రోజు రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు పెట్టుకొని ఇరు కుటుంబాలు ఈ వివాహానికి కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని సమాచారం. కాగా నితిన్ ఇటీవల తన దీర్ఘకాల స్నేహితురాలు షాలినితో తన నివాసంలో నిరాడంబరంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుక ఫోటోలను నితిన్ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసారు. ఈ ఫొటోలో నితిన్ క్రీమ్ కలర్ సంప్రదాయ కుర్తా పైజమా ధరించగా.. షాలిని బంగారు రంగు పట్టుచీరలో కనిపించారు.
అయితే నితిన్ ఎంగేజ్మెంట్ నాడు ధరించిన కుర్తా పైజామా ధర తెలుసుకొని ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల దుస్తుల్లో దర్శనమిచ్చిన నితిన్ నిశ్చితార్ధ వేడుక కోసం 67200 రూపాయల ఖరీదు గల కుర్తాను ధరించారు. ఈ కుర్తాను ప్రముఖ డిజైనర్ అభినవ్ మిశ్రా ఎస్.ఎస్20 కలెక్షన్స్ నుంచి తీసుకోబడిందని తెలుస్తోంది. ఈ కుర్తాలో నితిన్ ఎంత హ్యాడ్సమ్ గా కనిపించాడో తెలిసిందే. ప్రస్తుతం నితిన్ ఎంగేజ్మెంట్ కుర్తా ధర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.