Begin typing your search above and press return to search.
శ్రీనివాసుడికి సెంటిమెంట్ గండం!
By: Tupaki Desk | 4 Aug 2018 4:33 AM GMTఆగస్ట్ లో వరుసబెట్టి వస్తున్న సినిమాలతో ప్రేక్షకుడు ఏది ముందు చూడాలో తెలియని అయోమయం లో ఉన్నాడు. తెలుగుతో పోటీగా బాలీవుడ్ నుంచి కూడా చెప్పుకోదగ్గ సినిమాలు వస్తుండటం ఎ సెంటర్స్ లో థియేటర్స్ సమస్యని సృష్టిస్తోంది.ఇది వచ్చే వారం కూడా కంటిన్యూ కాబోతోంది. మరీ ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణం మీదే అందరి గురి ఉంది. ఆ రోజు పోటీ లేకుండా జాగ్రత్త పడిన దిల్ రాజు దానికి ఫ్యామిలీ ప్రేక్షకులు పట్టం కడతారని చాలా ధీమాగా ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. శ్రీనివాస కళ్యాణం పూర్తిగా పెళ్లి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా. హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకోవడం వాళ్ళ రెండు కుటుంబాలు పరస్పరం ఒప్పుకుని పెళ్లి పీటల దాకా చేరుకోవడం ఇలా ఒక డ్రామాలా నడిచిపోతుంది. ట్రైలర్ లో చూపించింది కూడా ఇదే. రెండు నిముషాలు ఉన్న ట్రైలర్ లో పెద్దగా మలుపులు ఉన్నట్టు అనిపించలేదు. నితిన్ రాశిఖన్నా పాత్రలు ప్రేమించుకోవడం పెద్దల అంగీకారం ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు ఇలా సాగిపోయింది కానీ సం థింగ్ స్పెషల్ అనిపించే మెటీరియల్ అయితే ఏమి కనిపించలేదు.
అసలే పెళ్లి సినిమాలు ఆడటం ఈ మధ్య కాలంలో ఆడటం లేదు. గంటల తరబడి పెళ్లి వేడుకలు తెరమీద చూపిస్తే మురిసిపోయే ట్రెండ్ కాదిది. కొన్నేళ్ల క్రితం ఇదే లైన్ మీద కృష్ణవంశీ మొగుడు అనే సినిమా తీసాడు. కథ సేమ్ ఇలాగే మొదలై వియ్యంకులు మధ్య ఈగో సమస్యతో పెళ్లి పెటాకులు కావడాన్ని చూపించి మళ్ళి ఒకటి చేయటం అనే పాయింట్ ని ప్రేక్షకులు తిరస్కరించారు. శ్రీనివాస కళ్యాణం అదే బాపతు అని చెప్పలేం కానీ లైన్ మాత్రం అలాగే కనిపిస్తోంది. దానికి తోడు రాజేంద్ర ప్రసాద్-నరేష్ లాంటి ఆర్టిస్టులు అందులో ఉన్నారు ఇందులోనూ ఉన్నారు.
సో శ్రీనివాస కళ్యాణం మెప్పించాలంటే ఎమోషనల్ గా టచ్ చేసే సాలిడ్ కంటెంట్ ఉండాలి. ఓ మోస్తరు మధ్య తరగతి పెళ్ళికే లక్షలు ఖర్చు పెడుతూ జనాలు వీడియోలను తీయిస్తున్న తరుణంలో హీరో హీరోయిన్ల పెళ్లిని ఎక్కువ సేపు చూపిస్తూ పోతే తన్మయత్వం చెందే సీన్ లేదు. మరి సతీష్ వేగ్నేశ ఎలాంటి డ్రామాను శ్రీనివాస కళ్యాణంలో చూపించబోతున్నాడు అనేదే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. ఒక్క రోజు గ్యాప్ లో విశ్వరూపం 2 మరో వారం తేడాతో గీత గోవిందం వస్తున్న నేపధ్యంలో పెళ్లి సినిమాలు ఆడని నెగటివ్ సెంటిమెంట్ కి ఎదురీది శ్రీనివాస కళ్యాణం గెలవడం గురించి ట్రేడ్ కూడా చాలా ఆసక్తిగా ఉంది.