Begin typing your search above and press return to search.
భీష్మతో పాటు మరోటి కూడా..
By: Tupaki Desk | 23 Jun 2019 5:17 AM GMTఇన్నాళ్ల వెయిటింగ్ కి తెర పడింది. అభిమానుల కోరిక నెరవేరింది. నితిన్ ఈజ్ బ్యాక్ ఎగైన్. అభిమానుల కోరిక మేరకు అతడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వేగం పెంచాడు. ఇప్పటికిప్పుడు ఒకటి కాదు రెండు సినిమాలు ప్రారంభించేశాడు. ఒకదాని వెంట ఒకటిగా ఇవి రెండూ రిలీజ్ లకు తెస్తాడట. ఇప్పటికే నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మొదలైంది. ఈలోగానే సీనియర్ దర్శకులు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోని సినిమాని ప్రారంభించేశాడు నితిన్.
అందుకు సంబంధించిన వివరాల్ని తనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ``నితిన్ 28 ముహూర్తం చేసేశాం. చంద్రశేఖర్ ఏలేటి గారితో కలిసి పని చేయడం సూపర్ ఎగ్జయిటెడ్ గా ఉంది. ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉండబోతోంది. ఇందులో రకుల్ ప్రీత్ ని కథానాయికగా ఫైనల్ చేశాం. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ వేరొక కథానాయికగా నటిస్తోంది. భవ్య సిమెంట్స్ ఆనంద ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు`` అని తెలిపారు.
నితిన్ - ఏలేటి సినిమా కథాంశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. అవయవదానం నేపథ్యంలో ఆసక్తి రేకెత్తించే సినిమా ఇదని... ప్రధాన థీమ్ పై కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. రొటీన్ కి భిన్నమైన చిత్రమిది. కంటతడి పెట్టించే ఎమోషన్ ఉంటుందని.. చక్కని సామాజిక సందేశం ఉండేలా దర్శకుడు కథాంశాన్ని తీర్చిదిద్దారన్న ముచ్చటా సాగుతోంది.