Begin typing your search above and press return to search.
నితిన్ నో కాంప్రోమైజ్
By: Tupaki Desk | 19 Sep 2018 7:57 AM GMTఒక మంచి హిట్టుతో కెరీర్ గాడిలో పడింది అనుకునే లోపే వరుస పరాజయాలు నితిన్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కథల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉన్నా దెబ్బలు తప్పడం లేదు. త్రివిక్రమ్ తో అఆ చేసినప్పుడు 2 మిలియన్ డాలర్ల మూవీ రాగానే ఇకపై అంతా శుభమే అనుకున్నాడు. కానీ లైతో మొదలైన ప్లాపుల పర్వం శ్రీనివాస కళ్యాణం దాకా కొనసాగింది. యాక్షన్ థ్రిల్లర్ గా చేసిన లైలో అర్జున్ మణిశర్మ లాంటి టాప్ యాక్టర్స్ కం టెక్నీషియన్స్ ఉన్నా అపజయం నుంచి తప్పించుకోలేకపోయింది. రంగస్థలం వచ్చిన వారంలోపే చల్ మోహనరంగాను తీసుకొస్తే రెండు రకాలుగా నష్టపోయింది. త్రివిక్రమ్ కథ పవన్ కళ్యాణ్ నిర్మాణం ఏవి పనిచేయలేదు. ఇక ఆగస్ట్ లో తన కెరీర్ బెస్ట్ అని పదే పదే చెప్పుకున్న దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం కనీసం యావరేజ్ అయినా అవుతుందనుకుంటే ఆశలన్నీ నీరుగారుస్తూ నీరసపడి పోయింది.
మొత్తానికి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న నితిన్ ఇక నో కాంప్రోమైజ్ అంటున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే భీష్మ(ప్రచారంలో ఉన్న టైటిల్)కోసం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హీరోయిన్ గా డిమాండ్ పీక్స్ లో ఉన్న రష్మిక మందన్ననే ఓకే చేసుకోగా సంగీతం కోసం స్టార్ హీరోలకు తప్ప ఇంకెవరికి అంత ఈజీగా దొరకని దేవి శ్రీ ప్రసాద్ ని సెట్ చేస్తున్నారు. మిగిలిన విభాగాల్లో కూడా బెస్ట్ టీమ్ మెంబెర్స్ ఉండేలా నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం. అందుకే షూటింగ్ మొదలుపెట్టడం ఆలస్యమవుతోందని సమాచారం. ఖచ్చితంగా హిట్ కొట్టే తీరాల్సిన తరుణంలో ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. పెళ్లి వద్దనుకున్న ఒక యువకుడి జీవితంలో జరిగిన సరదా సంఘటనలు ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఛలో తరహాలోనే అన్ని అంశాలు మేళవించి వెంకీ కథ రాసుకున్నట్టు టాక్. మరి నితిన్ కోరుకున్న బ్రేక్ వెంకీ ఇస్తాడో లేదో వచ్చే ఏడాది తేలుతుంది.