Begin typing your search above and press return to search.
కీర్తి నన్ను చాలా టార్చర్ పెట్టేసింది: హీరో నితిన్
By: Tupaki Desk | 22 March 2021 3:30 AM GMTనితిన్ - కీర్తి సురేశ్ జంటగా 'రంగ్ దే' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సీనియర్ నరేశ్ .. రోహిణి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ 'శిల్పకళా వేదిక'లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకకి దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. సిల్వర్ కలర్ శారీతో కీర్తి సురేశ్ ఈ వేడుకకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.
హీరో నితిన్ వేదికపై మాట్లాడుతూ .. శిల్పకళా వేదికకు 'అ ఆ' సినిమా ఫంక్షన్ తరువాత రావడం ఇదే. అప్పుడు పవన్ కల్యాణ్ గారు ముందు వరుసలో కూర్చోవడమే నాకు ఇంకా గుర్తుకువస్తోంది. ఇక 'రంగ్ దే' విషయానికొస్తే, ఈ సినిమాలో నేను కాలేజ్ స్టూడెంట్ ను .. నా వయసు 24 ఏళ్లు .. కానీ నా అసలు వయసు 36 ఏళ్లు. అందువలన నేను ఆలోచనలో పడ్డాను. సినిమాటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ గారు అనగానే, నా టెన్షన్ ఎగిరిపోయింది. తెరపై చూస్తే కీర్తి కంటే నేనే కాస్త యంగ్ గా కనిపిస్తాను. కీర్తి అనగానే మనకి గుర్తువచ్చేది 'మహానటి' అని. ఈ సినిమాలో మాత్రం ఆమె మహానాటు .. మహానాటీ. ఈ సినిమాలో నన్ను ఆమె చాలా చాలా టార్చర్ పెట్టేసింది. ఈ సినిమాకి ఆమె బిగ్ ఎస్సెట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వెంకీ అట్లూరి ఈ సినిమాను చాలా బాగా తీశాడు. వరుసగా ఆయన లవ్ స్టోరీస్ నే తీస్తూవస్తున్నాడు. బహుశా కాలేజ్ రోజుల్లో లవ్ స్టోరీస్ ఎక్కువగా ఉండి ఉంటాయి. హారిక అండ్ హాసిని .. సితార బ్యానర్లో నాకు ఇది మూడవ సినిమా. మొదటి సినిమా 'అ ఆ' .. 'రెండవ సినిమా 'భీష్మ' .. మూడవ సినిమా 'రంగ్ దే'. సెంటిమెంట్ ఏమిటంటే నాకు ఫ్లాప్ పడిన ప్రతిసారి హిట్ ఇస్తూ వస్తున్నారు. అందుకు వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రివిక్రమ్ గారి గురించి నేను ఒకే ఒక్క మాట చెబుతాను. ఇండస్ట్రీలో నాకు రెండుకళ్లు ఎవరంటే ఒకటి పవన్ కల్యాణ్ గారు .. రెండు త్రివిక్రమ్ గారు. వాళ్లిద్దరూ నా వెనకాల ఉన్నారు .. అదే నా దమ్ము .. అదే నా ధైర్యం" అంటూ చెప్పుకొచ్చాడు.