Begin typing your search above and press return to search.

నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:16 AM GMT
నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
X
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరు హీరో నితిన్. హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదిహేడేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ కల్యాణగీత ఎప్పుడున్న దాని మీద చిరునవ్వే తప్పించి.. సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇకపై.. అలాంటి పరిస్థితి లేదనే చెబుతున్నారు. త్వరలో అతగాడి పెళ్లి భారీ స్థాయిలో జరగనున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ చేసుకునే అమ్మాయి పేరు శాలిని అని.. ఏప్రిల్ 16న ఆమెతో పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. యూకేలో ఎంబీఏ చేసిన ఆమెను.. నితిన్ నాలుగేళ్లుగా లవ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా లవ్ కమ్ పెద్దలు ఓకే చెప్పిన ప్రేమ వివాహం గా చెబుతున్నారు. తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలలో చెప్పి.. వారిని ఒప్పించి మరీ చేసుకుంటున్నారట.

నితిన్ పెళ్లి పనులు అప్పుడే స్టార్ట్ అయ్యాయయని.. యువ నిర్మాత కమ్ నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి పనులు చూసుకుంటున్నారని చెబుతున్నారు. నితిన్ ది డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెబుతున్నారు. దుబాయ్ లోని ప్యాలసో వెర్సేస్ హోటల్ లో వీరి పెళ్లి గ్రాండ్ గా జరగనుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్నారు. మరీ డెస్టినేషన్ వెడ్డింగ్ కు టాలీవుడ్ నుంచి ఎవరెవరికి ఆహ్వానం అందుతుందో చూడాలి మరి.