Begin typing your search above and press return to search.
నిఖిల్ బాటలోనే నితిన్ కూడా నడవబోతున్నాడా...?
By: Tupaki Desk | 21 May 2020 3:30 PM GMTఇప్పుడు ప్రపంచం మొత్తం అనుకోకుండా వచ్చిన ఒక మహమ్మారితో అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇన్నేళ్లు అభివృద్ధి పథంలో పురోగతి చూపిస్తూ దూసుకుపోతున్న దేశాలన్నీ ఒక్కసారిగా తిరోగమనంలోకి వెళ్లేలా చేసింది. అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపిస్తూ అందరి ప్లాన్స్ తలక్రిందులు చేసింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా భారీ సమూహాలు ఏర్పడే ఫంక్షన్స్ కి అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో అతి తక్కువ మంది సన్నిహితులు బంధువుల మధ్య వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనుకున్న సుముహార్తానికి కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న వారు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన రెండో వివాహాన్ని కొద్దిమంది ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో చేసుకున్నాడు. అంతేకాకుండా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం పల్లవి వర్మతో జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా తెలిపిన నిఖిల్ సడెన్ గా నిర్ణయం తీసుకుని వెడ్ లాక్ పూర్తి చేసి అందర్నీ షాక్ కి గురి చేసాడు.
కాగా నిఖిల్ బాటలోనే నితిన్ కూడా నడవబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న నితిన్ - షాలిని జంట దుబాయ్ లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా దెబ్బతో ప్లాన్ అంతా తారుమారైంది. విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడం.. ప్రస్తుత పరిస్థితిలో పెళ్లి చేసుకొనే ఆలోచన విరమించుకొని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులన్నీ చక్కబడ్డ తరువాతే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు నితిన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఇప్పట్లో పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో.. సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట నితిన్. ఇరువురి సన్నిహితుల మధ్యలో నితిన్ - షాలిని వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమైనట్లు.. దీనికి సంబంధించి డేట్స్ కూడా ఖరారు చేసినట్లు పలు ప్రసార మాధ్యమాలలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.