Begin typing your search above and press return to search.
నేను రోబోని కాను..రెస్ట్ లో ఉంటే అలా అల్లేస్తారా!
By: Tupaki Desk | 26 July 2022 9:30 AM GMTనిత్యామీనన్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందని..అతన్నే పెళ్లి చేసుకుంటుందని..ఆ సమయం కూడా రానే వచ్చేసిందని బలమైన కథనాలే తెరపైకి వచ్చాయి. మెయిన్ స్ర్టీమ్ మీడియా సైతం ఈ కథల్ని ధృవీకరించడంతో నిత్య నిజంగానే పెళ్లి చేసుకుంటుందని బలమైన ఆధారం దొరికిన్లు అయింది.
దీంతో కొన్ని రోజులుగా నిత్యామీనన్ పై రకరకాల కథనాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా వాటన్నింటికి పుల్ స్టాప్ పెట్టేందుకు నిత్య రంగంలోకి దిగింది. ``ఎవరో పనిగట్టకుని అల్లిన కట్టు కథనాలవి. వాటిని మరికొందరు ఎలాంటి ఆధారు లేకుండా పబ్లిష్ చేసారు. అలాంటివి ఏమైనా ఉంటే నన్ను సంప్రదిస్తే నేనే స్వయంగా వివరణ ఇచ్చేదాన్ని.
కానీ ఆ ఛాన్స్ లేకుండా చేసారు. ప్రస్తుతం నేను ఎవరి లవ్ లో లేను. పెళ్లి చేసుకోవడం లేదు. నేనే ఏడాది కాలంగా సినిమాలు సహా వివిధ టీవీ షోలతో బీజీగా ఉన్నాను. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను. అందుకే ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ గ్యాప్ లో నేను ఎవరితోనో లవ్ లో పడ్డానని..విదేశాలు చెక్కేస్తున్నానని ఇష్టానుసారం కథనాలు అల్లారు. అవన్నీ తప్పుడు వార్తలు.
ఎంత నటిని అయినా నేను మనిషినే..ప్రతీసారి అందరికీ కనిపించాలని లేదు. నిరంతరం సినిమాల్లోనే పనిచేయడానికి నేను రోబోని కాదు. యాంత్రికంగా పనిచేయలేను. నా చీలమండకి గాయమైంది. దీంతో కొన్ని రోజులు రెస్ట్ లో ఉన్నాను. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే నా విశ్రాంతి ఇప్పుడే మొదలైంది` అని అసలు విషయాన్ని రివీల్ చేసింది.
దీంతో నిత్య పెళ్లిపై వస్తోన్న కథనాలకు పుల్ స్టాప్ పడింది. అలాగే ఈవెంట్లకు హాజరు కావాలని...మేనేజర్లు సహా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కానీ వెళ్లలేని పరిస్థితి. దయచేసి అలాంటి ఈవెంట్లకు ఆహ్వానించ వద్దు అంటూ చెప్పుకొచ్చింది.
లవ్..డేటింగ్ వంటి టాపిక్స్ లో నిత్యామీనన్ పేరు తెరపైకి వస్తే వెంటనే ఆమె స్పందిస్తుంది. గతంలోనూ కొన్నిసార్లు ఇలాంటి కథనాలు వ ఎలువడిన నేపథ్యంలో వాటిని వెంటనే ఖండించింది.