Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ ను ఫోటో షాప్ అంటున్నారు!

By:  Tupaki Desk   |   5 Dec 2018 10:48 PM IST
ఫస్ట్ లుక్ ను ఫోటో షాప్ అంటున్నారు!
X
నూతన దర్శకురాలు ప్రియదర్శిని 'అమ్మ' జయలలిత బయోపిక్ ను 'ది ఐరన్ లేడీ' టైటిల్ తో తెరకెక్కిస్తానని కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయ పాత్రకు మలయాళ హీరోయిన్ నిత్య మీనన్ ను ఎంచుకున్నారు. జయలలిత వర్ధంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు 'ది ఐరన్ లేడీ' టీమ్.

ఫస్ట్ లుక్ ఎలా ఉంది అంటే అదిరిపోయింది.. నిత్య అచ్చుగుద్దినట్టు 'అమ్మ' గా మారిపోయింది. అసలు జయలిత పాత్రకు నిత్య తప్ప వేరే నటి సెట్ కానట్టుగా అనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ కు దర్శకురాలు ఫుల్ గా థ్రిల్ అయింది. కానీ కొంతమంది మాత్రం ఇది ఒరిజినల్ నిత్య ఫోటో కాదని.. జయలలిత పాత ఫోటోను తీసుకుని దాన్ని నిత్య మేనన్ ఫేస్ తో ఫోటో షాప్ సాయంతో మిక్స్ చేశారని.. అందుకే ఫస్ట్ లుక్ ఇలా ఉందని అంటున్నారు.

మరి ఈ విమర్శలలో నిజముందా లేదా అనేది తెలీదు కానీ ఫస్ట్ లుక్ ను పరిశీలనగా చూస్తే మాత్రం నిజమేనని అనిపిస్తోంది. అయినా నిత్యా లాంటి టాలెంటెడ్ నటి ఉన్నప్పుడు ఇలాంటి ఫోటోషాప్ ఫస్ట్ లుక్స్ తో వచ్చే అవసరం ఉండదు. మరి దర్శకురాలు ప్రియదర్శిని మనసులో ఏముందో ఏమిటో!