Begin typing your search above and press return to search.

నిత్య మీనన్‌ ఇక సెగలు పెంచేస్తోందా?

By:  Tupaki Desk   |   16 March 2015 1:22 PM GMT
నిత్య మీనన్‌ ఇక సెగలు పెంచేస్తోందా?
X
చూశారుగా.. ఆ ఒక్క ఫోటో చాలు.. అసలు నిత్య మీనన్‌ ఏం చేయబోతోందో చెప్పడానికి. నిజానికి ఇప్పటివరకు ఎక్స్‌పోజింగ్‌ వైపు అడుగులు వేయకుండా కేవలం తన టాలెంట్‌తోనే ప్రూవ్‌ చేసుకున్న హీరోయిన్‌ నిత్య మీనన్‌. అమ్మడు అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌లో మొదలైనప్పటినుండి ఇక్కడ ఇరగదీస్తూనే ఉంది. ఇకపోతే తొలిసారిగా ఈవిడ ఒక స్టార్‌హీరో సినిమాలో చేస్తోంది. అదే సన్‌ ఆప్‌ సత్యమూర్తి.

ఈ సినిమాలో నిత్య కూడా ఒక హీరోయిన్‌ అని ఇక వేరే చెప్పక్కర్లేదు. ఇక ఆమెకు కూడా ఒక సోలో సాంగ్‌, రెండు గ్రూప్‌ సాంగులు ఉన్నాయి. అంటే ఆమె పాత్ర ఎంత ముఖ్యమో చూడండి. ఇక ఆ ఫోటోలో చూస్తే.. పిక్కలు కనిపించేలా చిన్నపాటి డ్రస్‌ వేసుకొని మరీ హడావుడి చేస్తోంది నిత్య. ఏంటి ఇదంతా కేవలం బన్నీ సినిమాలో ఛాన్సు వచ్చినందుకేనా? నిజానికి స్కిన్‌షో చేయనని ఎప్పుడో చెప్పేసిన నిత్య మీనన్‌ ఇప్పుడెందుకు ఇంత హాట్‌గా రచ్చ చేస్తోంది? దానికి స్పెషల్‌గా కారణం ఉందో లేదో తెలియదు కాని.. చూస్తుంటే సెగలు మాత్రం పెరుగుతున్నాయి..