Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిన నిత్యా మీనన్..?

By:  Tupaki Desk   |   19 July 2022 4:30 PM GMT
స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిన నిత్యా మీనన్..?
X
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పద్ధతిగా మెలిగే పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

'ఇష్క్' 'గుండెజారి గల్లంతైందే' 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'జనతా గ్యారేజ్' 'అ!' వంటి సినిమాలతో విజయాలు అందుకుంది. అయితే నిత్యా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదీ ఒప్పుకోలేదు. దీనికి కారణం ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకోవడమే అని టాక్ నడుస్తోంది.

తాజాగా ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం నిత్యా మీనన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. మలయాళ చిత్ర పరిశ్రమలోని ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉందని.. అతన్నే పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వీరి వివాహానికి ఆయా కుటుంబాల నుంచి ఆమోదం లభించిందని.. ఈ క్రమంలోనే పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే నిత్యా మెడలో మూడు ముళ్ళు వేయబోయే ఆ హీరో ఎవరనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచబడింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కాలంలో నిత్యా మీనన్ తెలుగులో మంచి సక్సెస్ అందుకోలేకపోయిందనే చెప్పాలి. ప్రొడ్యూసర్ గా చేసిన 'స్కై ల్యాబ్' సినిమా నిరాశ పరిచింది. ఈ ఏడాది ప్రారంభంలో 'భీమ్లా నాయక్' చిత్రంలో మెరిసింది.

అలానే ఆహా ఓటీటీ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ హంట్ షోలో జడ్జీలలో ఒకరిగా కనిపించింది. ఇదే క్రమంలో ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'మోడరన్ లవ్ హైదరాబాద్' వెబ్ సిరీస్‌ లో కూడా నటించింది.

ఇక మలయాళంలో చేసిన '19(1)(a)' ‘ఆరం తిరుకల్పన’ సినిమాలతో పాటుగా తమిళ్ లో నటించిన 'తిరుచిత్రంబలం' చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత ఆమె ఏ కొత్త ప్రాజెక్ట్‌ కి కూడా కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పెళ్లి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే నిత్యా మీనన్ ఈ ఊహాగానాలపై స్పందించలేదు. మరి త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తుందేమో చూడాలి.