Begin typing your search above and press return to search.

జయ బయోపిక్ - ప్రశ్నలెన్

By:  Tupaki Desk   |   6 Dec 2018 6:11 AM GMT
జయ బయోపిక్ - ప్రశ్నలెన్
X
ఇప్పుడంతా బయోపిక్ ల సీజన్. సుమారు అరడజను పైగా తెలుగులోనే నిర్మాణమవుతుండగా ఇప్పుడిది పక్క భాషలకు కూడా పాకింది. నిన్న నిత్య మీనన్ టైటిల్ పాత్ర లో జయలలిత కథ గా రూపొందుతున్న ది ఐరన్ లేడీ అనే పోస్టర్ ఆన్ లైన్ లో బాగానే రచ్చ చేసింది. కాకపోతే కొన్ని అనుమానాలను రేపిన ఈ పోస్టర్లో నిత్య మీనన్ లుక్ ఏదో ఫోటోకి మార్ఫింగ్ చేసినట్టుగా ఉందే తప్పించి సహజంగా అనిపించలేదు. హెయిర్ స్టైల్ తో పాటు నిత్య ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇది కొత్త ఫోటో అనిపించేలా లేకపోవడం చూస్తుంటే ఏదో ప్రకటన కోసం డిజైన్ చేసిన పోస్టర్ లా అనిపిస్తోంది తప్ప ఇందులో ఇంకెలాంటి ప్రత్యేకత లేదు.

ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లుక్ ని డిసెంబర్ 5 జయలలిత రెండవ వర్ధంతి సందర్భంగా విడుదల చేసారు. నిజానికి చెన్నై టాక్ ప్రకారం ఇది ఒరిజినల్ కాదట. నిత్య చేయడం కన్ఫర్మ్ అయినప్పటికీ ఫోటో షూట్ కి టైం లేకపోవడంతో ఇలా లాగించేశారని తెలిసింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. టైటిల్ ది ఐరన్ లేడీ అంటూ పెట్టడం. తమిళనాడులో పరభాషల్లో పెట్టిన టైటిల్స్ కి పన్ను రాయితీ ఉండదు. అదనపు బాదుడు ఉంటుంది.

అందుకే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కథ ఎలా డిమాండ్ చేసినా తమిళ బాషలోనే పేర్లు పెడతారు. ఆ కారణంగానే కొన్ని టైటిల్స్ కవితాత్మకంగా కూడా ఉంటాయి. అయితే జయలలిత సినిమాకు పక్కా ఇంగ్లీష్ లో ది ఐరన్ లేడీ అని పెట్టడం పట్ల అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి. శుభ్రంగా పురుచ్చితలైవి అని పెట్టకుండా ఇదేం పేరు అంటున్న వాళ్ళ సంఖ్య భారీ గా ఉంది. మొత్తానికి మొక్కుబడి ప్రకటనకు తగ్గట్టే పోస్టర్ కూడా ఉందన్న ఫీడ్ బ్యాక్ బలంగా వచ్చింది. నిత్య మీనన్ తానుగా దీని గురించి ఒక క్లారిటీ ఇస్తే బెటరేమో