Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ కోసమైతే తగ్గుతానంటోంది..!

By:  Tupaki Desk   |   12 Nov 2018 1:20 PM GMT
బాలీవుడ్‌ కోసమైతే తగ్గుతానంటోంది..!
X
అలా మొదలైంది అంటూ కెరీర్‌ ను ఆరంభించిన నిత్యా మీనన్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. మంచి నటనతో పాటు తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకోవడం, పాటలు కూడా పాడటం వంటి మల్టీ ట్యాలెంట్‌ ను చూపించడంతో నిత్యామీనన్‌ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈమెకు మంచి ఆఫర్లు కూడా తలుపు తడుతాయని అంతా భావించారు. కాని స్కిన్‌ షోకు నో చెప్పడంతో పాటు, పాత్ర పరిధి ఎక్కువ ఉండాలని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రను మాత్రమే చేస్తానంటూ చెబుతూ వచ్చిన కారణంగా నిత్యామీనన్‌ కెరీర్‌ సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌ గా మారిపోయింది.

ఈమద్య నిత్యామీనన్‌ బాగా లావు పెరిగింది. లావు పెరగడంతో అవకాశాలు ఇంకా సన్నగిల్లాయి. ఆఫర్ల కోసం మీరు సన్నబడుతారా అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అగ్గిమీద గుగ్గిలం అన్నట్లుగా నిత్యామీనన్‌ సీరియస్‌ అవుతోంది. నేను లావుగా ఉంటే నీకు ఏమైనా సమస్యా అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. సినిమాల్లో ఆఫర్లు రాకున్నా పర్వాలేదు కాని నేను లావు తగ్గను, నేను ఎలా ఉంటే అలాగే సినిమాల్లో కనిపించాలని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా బాలీవుడ్‌ ఆఫర్‌ రావడంతో సన్నబడాలని తాపత్రయ పడుతోందట.

అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘మిషన్‌ మంగల్‌’ చిత్రంలో నిత్యా మీనన్‌ ఒక హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్‌ తో పాటు విద్యా బాలన్‌ - సోనాక్షి సిన్హా - తాప్సిలు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్‌ లో చాన్స్‌ వచ్చిన నేపథ్యంలో ఆ ఛాన్స్‌ ను ఉపయోగించుకుని లావు తగ్గి, ముందు ముందు బాలీవుడ్‌ లో సెటిల్‌ అవ్వాలని నిత్యామీనన్‌ భావిస్తుందట. అందుకే గత కొన్ని రోజులుగా లావు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తుందని మలయాళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.