Begin typing your search above and press return to search.

 పేద పిల్లలతో నిత్యా మీనన్.. గొప్ప మనసు

By:  Tupaki Desk   |   18 Jan 2023 12:35 PM GMT
 పేద పిల్లలతో నిత్యా మీనన్.. గొప్ప మనసు
X
సౌత్ ఇండియాలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నిత్యా మీనన్. సౌందర్య ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ తో టాలెంటెడ్ యాక్టర్ గా నిత్యా మీనన్ కి టాలీవుడ్ లో గుర్తింపు ఉంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

ఈ మధ్య నిత్యా మీనన్ సినిమాలు తగ్గించిన కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులని పలకరిస్తూనే ఉంటుంది. అలాగే ఈ బ్యూటీ ఏ భాషలో నటిస్తే ఆ భాషలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు అంటే కొత్త సంవత్సర వేడుకలని పబ్ లలో, లేదంటే ప్రత్యేకంగా ఈవెంట్స్ లలో జరుపుకుంటారు.

అలాగే కొంత మంది సెలబ్రిటీలు తమకున్న ఇమేజ్ తో ఆ రోజు కూడా ప్రైవేట్ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసి లక్షల రూపాయిల ఆదాయం సంపాదిస్తారు. న్యూ ఇయర్ వచ్చింది అంటే కచ్చితంగా సెలబ్రిటీలకి పండగే అని చెప్పాలి. అయితే వీటికి కొంత మంది సెలబ్రిటీలు మాత్రం అతీతం అని చెప్పాలి.

అలాంటి వారిలో నిత్యా మీనన్ కూడా ఒకరు. ఈ బ్యూటీ డబ్బు కంటే ఎక్కువగా తన వ్యక్తిగత స్వేచ్చకి ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఫంక్షన్స్ కి కూడా పెద్దగా హాజరు కాదు. టైం దొరికితే ఆలయాలు దర్శించుకోవడం లేదంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చేస్తుంది.

అలాగే అప్పుడప్పుడు తనలోని మానవత్వాన్ని చూపిస్తూ సోషల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ సారి ఆమె కొత్త సంవత్సర వేడుకలని చాలా ప్రత్యేకంగా చేసుకున్నారు. న్యూ ఇయర్ రోజు ఓ పాఠశాలకి వెళ్లి టీచర్ అవతారం ఎత్తి పిల్లలకి క్లాసులు చెప్పారు.

ఓ ఇంగ్లీష్ బుక్ పట్టుకొని అందులో కథని చదువుతూ దానిని పిల్లలకి తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబందించిన వీడియోని నిత్యా మీనన్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాను న్యూ ఇయర్ వేడుకలని పిల్లలతో కలిసి చేసుకున్నాను అంటూ అందులో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.