Begin typing your search above and press return to search.
ఆ టాప్ హీరోయిన్ ను బ్యాన్ చేస్తారట
By: Tupaki Desk | 30 April 2019 6:16 AM GMTఅందంతో పాటు, ప్రతిభ ఉన్న నటి నిత్యామీనన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నటిగా నిత్యామీనన్ మంచి పేరు తెచ్చుకుంది. స్కిన్ షోకు ఎప్పటికప్పుడు నో చెబుతూ వస్తూ, కేవలం తన ప్రతిభతో మాత్రమే అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్న ముద్దుగుమ్మ నిత్యామీనన్ పై ఎప్పుడూ ఏదో ఒక విమర్శ ఉంటూనే ఉంది. తానో పెద్ద స్టార్ అనే ఫీలింగ్ తో నిత్యామీనన్ నిర్మాతలను మరియు దర్శకులను గౌరవించదని, దర్శకుడి పనిలో వేలు పెడుతుందనే విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోని నిత్యామీనన్ ఈసారి మాత్రం మలయాళ నిర్మాతలు తనపై చేస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చింది.
కొన్ని రోజులుగా నిత్యామీనన్ ప్రవర్తన మలయళ నిర్మాతలకు కోపం తెప్పిస్తుందట. పలువురు నిర్మాతలు ఆమెను కలిసేందుకు ప్రయత్నించగా, కనీసం వారితో మాట్లాడేందుకు కూడా నిత్యామీనన్ ఆసక్తి చూపించలేదట. దాంతో మలయాళ నిర్మాతలు ఆమె గురించి చర్చించి, ఆమెను బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిర్మాతల మండలిలో ఈ విషయంను చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయమై నిత్యామీనన్ తాజాగా స్పందించింది.
నిత్యామీనన్ మీడియాతో మాట్లాడుతూ ఆ నిర్మాతలు నన్ను కలిసేందుకు వచ్చిన సమయంలో షూటింగ్ లో ఉన్నాను. అమ్మ క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆ సమయంలో నేను కనీసం నటించడమే కష్టంగా ఉన్నాను. అలాంటి సమయంలో వారు నన్ను కలిసేందుకు వస్తే ఎలా మాట్లాడగలను. వారితో నేను ఏడ్చుకుంటూ మాట్లాడాలా అంటూ ప్రశ్నించింది. నన్ను మలయాళ ఇండస్ట్రీ నుండి దూరం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మకు ఆరోగ్యం లేక నేను మానసికంగా కుంగిపోయాను, అలాంటి సమయంలో సినిమాల గురించి చర్చించడం, మాట్లాడటంపై ఆసక్తి లేదు. అందుకే నేను మాట్లాడలేక పోయాను. వారు నన్ను ఎంతగా టార్గెట్ చేసినా కూడా నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అంది. నిత్యామీనన్ తన పరిస్థితిని వివరించిన నేపథ్యంలో మలయాళ నిర్మాతలు కాస్త మెత్తబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్ లో ఎంపిక అయిన నిత్యామీనన్ కు మలయాళంలో బ్యాన్ పెద్ద షాక్ అని చెప్పుకోవాలి.