Begin typing your search above and press return to search.
నిత్య... ఆ వయసులోనే!
By: Tupaki Desk | 6 July 2015 5:13 AMపక్కన హీరో ఎవరైనా కానివ్వండి. వాళ్లతో నిత్యమీనన్ కెమిస్ట్రీ మాత్రం అదిరిపోతుంది. నిజంగా ఆ హీరోతో ప్రేమలో ఉందేమో అన్నంత ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది నిత్య. చిన్న నవ్వుతోనే ఫ్రేమ్‌కి అందం తెచ్చేస్తుంది. అందుకే చాలామంది కథానాయకులు ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇంతకీ నిత్యమీనన్‌లో ఏముంది? కెమిస్ట్రీ విషయంలో ఆమె ఏం మాయ చేస్తుంది? ఇలాంటి సందేహాలే వ్యక్తం చేస్తుంటారు చాలామంది. ఆ సందేహాలకి నిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది.
తాను 18యేళ్ల వయసులో ప్రేమలో పడ్డాననీ, ఆ ప్రేమ తాలూకు అనుభూతుల్ని, అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకొని లవ్ సీన్స్‌లో నటిస్తుంటానని చెప్పుకొచ్చింది నిత్య. అందుకే ఆయా సన్నివేశాలు అంత ఎఫెక్టివ్‌గా తెరకెక్కుతుంటాయని అసలు రహస్యాన్ని బయటపెట్టింది. ఈ రకంగానైనా ప్రేమలోపడ్డ విషయాన్ని బయటపెట్టారు, ఇంతకీ మీరు మనసుపడ్డ ఆ కుర్రాడు ఎవరు? అని అడిగితే మాత్రం... ఆ వివరాలేవీ చెప్పకుండా నిత్య చాకచక్యంగా తప్పించుకొంది. 18యేళ్ల వయసులోని ప్రేమ కాబట్టి అవి ఇప్పుడు చెప్పకూడదంటోంది. చెబితే ఇబ్బందులొస్తాయంటోంది. ఈ యేడాది ఇప్పటికే నాలుగు చిత్రాలతో సందడి చేసిన నిత్య ఇటీవల కాస్త విరామం తీసుకొంది. సెలవులు పూర్తవ్వగానే మళ్లీ సెట్స్‌పైకి అడుగుపెట్టింది.