Begin typing your search above and press return to search.
సావిత్రి నాదే కాని: నిత్య మీనన్
By: Tupaki Desk | 20 Feb 2018 4:29 AM GMTఒకరు చేయాల్సిన సినిమాని ఏవో కారణాల వల్ల మరొకరు చేయటం అది కాస్త హిట్టో ఫట్టో కావడం ఇండస్ట్రీ లో సర్వ సాధారణం. అలా గతంలో హీరో హీరొయిన్లు మిస్ అయినవి లెక్కలేనన్ని ఉన్నాయి.. అలాంటిదే సావిత్రి అని నిత్య మీనన్ చెబుతోంది. అ! సినిమాలో ఎవరూ ఊహించని పాత్రలో కనిపించి షాక్ ఇచ్చిన నిత్య మీనన్ అందులో నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ఈ నేపధ్యంలో తన పెర్ఫార్మన్స్ కు దక్కుతున్న స్పందన పట్ల సంతోషంగా ఉన్న నిత్య అది మీడియాతో పంచుకుంటూ సావిత్రి గురించి చెప్పింది. నిజానికి సావిత్రి తాను చేయాల్సిన పాత్రని - కాని అనుకోని పరిస్థితుల వల్ల వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. కాని అవి ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు నిత్య. గత కొంత కాలంగా సపోర్టింగ్ రోల్స్ కే పరిమితమైన నిత్య మీనన్ హీరొయిన్ గా కనిపించిన చివరి సినిమా సందీప్ కిషన్ ఒక్క అమ్మాయి తప్ప.
ప్రస్తుతం ప్రాణ అనే బహు బాషా చిత్రంలో నటిస్తున్న నిత్య మీనన్ ఆ సినిమా కేవలం 23 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పింది. నాలుగు బాషలలో రూపొందే ఆ సినిమాలో నిత్య రచనా సహకారం కూడా ఇచ్చిందట. ఒక హిల్ స్టేషన్ నేపధ్యంలో తీసిన ప్రాణ మొత్తం కేరళలో తీసారు. చాలా అరుదుగా ఉపయోగించే సింక్ సౌండ్ ప్రాణ కోసం ఉపయోగించారు. గతంలో అమీర్ ఖాన్ రంగ్ దే బసంతి - పవన్ కళ్యాణ్ జానీ లాంటి అతి తక్కువ సినిమాలకు మాత్రమే ఇది వాడారు . ఇప్పటికైతే నిర్మాతగా మారడం గురించి ఆలోచన లేదని చెప్పిన నిత్య డైరెక్టర్ మాత్రం అయ్యే తీరుతుందట.
నిత్య చెప్పిందని కాదు కాని సావిత్రి పాత్ర నిత్య మీనన్ చేయబోతోంది అనే వార్త మహానటి ప్రారంభం కాకముందే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తన ఎత్తు - బరువు సావిత్రి గారికి సరితూగుతాయి కాబట్టి చేస్తుందనే అందరు అనుకున్నారు. కాని చాలా గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ ని సెట్ చేసారు. ఎందుకు అనేది నాగ అశ్విన్ కూడా ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు నిత్య మీనన్ కూడా దాటవేసింది కనక ఇది రహస్యంగానే మిగిలిపోనుంది.