Begin typing your search above and press return to search.
నిత్యాకి 'అమ్మ' ఫ్యాన్స్ కోటింగ్?
By: Tupaki Desk | 21 Nov 2018 4:29 AM GMTబయోపిక్ ల వెల్లువలో వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ప్రముఖుల జీవితకథలతో సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒరవడిలో ఇప్పటికే అరడజను రాజకీయ నాయకుల బయోపిక్ లను మన ఫిలిం మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మోస్ట్ అవైటెడ్ బయోపిక్ గా అమ్మ జయలలిత బయోపిక్ గురించి చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ - వైయస్సార్ బయోపిక్ లను మించిన క్రేజు ఈ బయోపిక్ కి నెలకొందన్న మాటా తమిళనాడులో వినిపిస్తోంది.
ఒక అసాధారణ మహిళ జీవిత కథ ఇది. ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీ జీవితపయనంలోని ఎన్నో గొప్ప ఎమోషనల్ ఎపిసోడ్స్ తో తీస్తున్న సినిమాగా దీనిని అభివర్ణిస్తున్నారు. 6సార్లు తమిళనాడును ముఖ్యమంత్రిగా ఏలిన ఐరన్ లేడీగా అమ్మ పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టిన నాయకురాలిగా అమ్మ ఎటాకింగ్ స్టైల్ ఎంతో గొప్పదని ప్రపంచ రాజకీయ దిగ్గజాలే విశ్లేషించారు. అలాంటి డైనమిక్ లీడర్ ని వేరొకరిని చూడలేదని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్యామణి హిల్లరీ క్లింటన్ పొగిడేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. నాలుగు రాష్ట్రాల్ని గజగజలాడించిన వీరప్పన్ ని అంతమొందించిన స్టార్ పొలిటీషియన్ గా అమ్మ పేరు చరిత్రకెక్కింది. అందుకే ఇంతటి ప్రముఖురాలిపై సినిమా అంటే ఆషామాషీనా? తేడాలొస్తే తంబీలు కొడతారు అంటూ విశ్లేషిస్తున్నారు ఓ పెద్దాయన.
`ది ఐరన్ లేడి- ఏ స్టోరి ఆఫ్ రివల్యూషనరీ లీడర్` పేరుతో తెరకెక్కుతున్న అమ్మ జయలలిత బయోపిక్ లో ఎవరు నటిస్తున్నారు? అంటే.. ఇప్పటికే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. జయలలితగా నిత్యా మీనన్ ఎంపికైంది. ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకత్వం వహించనున్నారు. పందెంకోడి దర్శకనిర్మాత లింగుస్వామి పెట్టుబడులు సమకూరుస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నిత్య రూపం మార్చుకుంటోంది. ఇప్పటికే బొద్దుగా ఉన్న నిత్యా మరింత బొద్దుగా మారుతున్న వైనం ఇటీవల తన పబ్లిక్ అప్పియరెన్స్ ఒకటి క్లియర్ కట్ గా తేల్చి చెప్పింది. ఇకపోతే ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్న నిత్యా ముందు అతిపెద్ద సవాల్ ఉందని సీనియర్ దర్శకుడు - ప్రముఖ హీరో బయోపిక్ తెరకెక్కిస్తున్న పెద్దాయన విశ్లేషించడం విశేషం. మద్రాసు పరిశ్రమతో అనుబంధం ఉన్న సదరు దర్శకుడు తేడాలొస్తే తంబీలు కొడతారు అని అన్నారంటే అర్థం చేసుకోవాలి. అయితే నిత్య ప్రతిభ గురించి సందేహించాల్సిన అవసరం ఏం లేదు. అమ్మకు ప్రతిరూపంగా అలరారుతుందనే అభిమానులు భావిస్తున్నారు. ఆ రూపం, ఆ ట్యాలెంట్ అంత గొప్పదని విశ్వసిస్తున్నారు. అమ్మ జయంతి ఫిబ్రవరి 24న ఈ క్రేజీ బయోపిక్ ప్రారంభం కానుందని ఇదివరకూ ప్రకటించిన సంగతి తెలిసిందే.