Begin typing your search above and press return to search.
నితిన్, నిత్యలకు మళ్లీ గుండె జారుతుందా?
By: Tupaki Desk | 23 Feb 2016 5:20 AM GMTవరుసగా డజన్ సూపర్ ఫ్లాప్స్ వచ్చిన ఏ కుర్ర హీరో అయినా మళ్లీ కోలుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ నితిన్ మాత్రం ఇష్క్ అంటూ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ రెండు సినిమాల్లోనూ నితిన్ - నిత్యా మీనన్ ల ఆన్ స్క్రీన్ లవ్ కెమెస్ట్రీ - లైటర్ వెయిన్ రొమాన్స్ లకు కుర్రకారు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నితిన్.. ఇప్పుడు మరోసారి నిత్యతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.
మూడోసారి నిత్యా మీనన్ తో జత కట్టేందుకు నితిన్ సిద్ధమవుతుండగా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నది కూడా గుండె జారి గల్లంతయ్యిందే డైరెక్టరే కావడం విశేషం. ఈ ముగ్గురు కలిసి బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు హీరో - హీరోయిన్లు ఇద్దరూ ఓకే చేసినట్లగా తెలుస్తోంది. దీనిపై త్వరలో డీటైల్స్ ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అ..ఆ.. మూవీని చేస్తున్నాడు నితిన్. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ లో నటిస్తోంది నిత్యా మీనన్. వీరిద్దరి డేట్స్ సెట్ అవగానే.. కొత్త ప్రాజెక్ట్ డీటైల్స్ ప్రకటించే ఛాన్స్ ఉంది.