Begin typing your search above and press return to search.
జయసుధ భర్త..చివరగా ఆమెతో ఏం చెప్పాడు?
By: Tupaki Desk | 15 March 2017 6:55 AM GMTదిల్ రాజు సతీమణి అనిత మృతి తాలూకు విషాదం నుంచి తెలుగు పరిశ్రమ కోలుకోకముందే.. జయసుధ భర్త నితిన్ కపూర్ అనూహ్య రీతిలో మృతి చెందడం కలచివేసింది. చాలా సింపుల్ గా కనిపిస్తూ.. జయసుధతో చాలా అన్యోన్యంగా కనిపించే నితిన్.. ఇలా ఆత్మహత్యకు పాల్పడతాడని ఎవ్వరూ అనుకోలేదు. ముందు ఆయనది అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ.. తర్వాత అలాంటిదేమీ లేదని తేలింది. ఆయన డిప్రెషన్ వల్ల బలవన్మరణానికి పాల్పడ్డట్లు తేలింది. నితిన్ ఏడాది కిందట్నుంచి డిప్రెషన్లో ఉన్నారట. ఇందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారట. అయినా ఆయనకు బతుకుమీద ఆశ లేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
ఐతే ఆత్మహత్యకు పాల్పడే చాలా మంది విషయంలో జరిగే తప్పిదం ఏంటంటే.. వాళ్లు ఎవ్వరూ లేని సమయంలో క్షణికావేశానికి గురై ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడిపోతారు. నితిన్ విషయంలోనూ అలాగే జరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నపుడు ఫ్లాట్లో ఇంకెవరూ లేరు. కొడుకులిద్దరూ ముంబయిలోనే ఉన్నప్పటికీ ఫ్లాట్లో మాత్రం లేరు. నిజానికి నితిన్ ముందు రోజు జయసుధతో మాట్లాడారట. హైదరాబాద్ వస్తున్నట్లు కూడా చెప్పారట. బుధవారం ముంబయి నుంచి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారట. అలాంటిది ఇంతలో అంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారో? ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు ఆయన్ని ఏవేవో ఆలోచనలు కమ్మేసినట్లున్నాయి. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/