Begin typing your search above and press return to search.
'అఖండ'లో నన్ను చూసి త్రివిక్రమ్ అనుకున్నారు!
By: Tupaki Desk | 7 Dec 2021 1:30 PM GMTబాలకృష్ణ కథానాయకుడిగా చేసిన 'అఖండ' విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఇప్పుడు విజయవిహారం చేస్తోంది. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా వసూళ్లు తగ్గకపోవడం .. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే టాక్ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపకపోవడం విశేషం.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా శ్రీకాంత్ కాకుండా తెరపై ఆయన పాత్ర మాత్రమే కనిపించిందంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ కాకుండా కొత్తగా మరో విలన్ ఎంట్రీ ఇచ్చాడు .. ఆయన పేరే నితిన్ మెహతా.
తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడారు. " నేను మోడలింగ్ చేస్తుంటాను .. తెలుగు సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు. ఇన్ స్టాలో నా ఫొటోను బోయపాటి చూశారట.
వెంటనే ఆయన నన్ను సంప్రదించారు. 'అఖండ' సినిమాలో ఒక విలన్ పాత్ర కోసం వెతుకుతూ ఉండగా నా ఫోటొ చూసినట్టు చెప్పారు. ఆ పాత్రకి నేను కరెక్టుగా సెట్ అవుతానని అన్నారు. కళ్లతోనే విలనిజాన్ని పలికించవలసి ఉంటుందని చెప్పారు. అయితే తెలుగు భాష గురించి నాకు ఏమీ తెలియదని అన్నాను.
అవన్నీ తాను చూసుకుంటానని బోయపాటి నాపై నాకు నమ్మకాన్ని కలిగించారు. నాకు సంబంధించి ఎలాంటి ఆడిషన్స్ తీసుకోలేదు. లుక్ టెస్ట్ మాత్రమే చేశారు అంతే .. ఆ తరువాత నేను నేరుగా సెట్స్ పైకి వెళ్లాను. బాలకృష్ణగారి గురించి నేను విన్నాను.
నాకేమో తెలుగు రాదు .. యాక్టింగ్ రాదు. బాలకృష్ణ గారు పెద్ద హీరో .. ఆయనతో ఫస్టు డే షూటింగు అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. నా ఇబ్బందిని ఆయన గ్రహించి నాకు ఎంతో హిల్ప్ చేశారు. నన్ను కంఫర్టుగా ఉంచడానికి ఆయన చాలా ప్రయత్నించారు.
ఇక బోయపాటి గారి వర్కింగ్ స్టైల్ చూసి నేను షాక్ అయ్యాను. తనకి ఏం కావాలనే విషయంలో ఆయనకి పూర్తి స్పష్టత ఉంది. అందువలన ఆయన తన పని తాను చేసుకుపోతుంటారు.
ఆర్టిస్టులకు వాళ్లపై వాళ్లకి నమ్మకాన్ని కలిగిస్తూ ముందుకు వెళుతుంటారు. ఈ రోజున నా పాత్రకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడానికి కారకులు బాలకృష్ణ .. బోయపాటినే.
ఈ సినిమా నుంచి ట్రైలర్ వదిలినప్పుడు నన్ను చూసి అంతా త్రివిక్రమ్ అనుకున్నారు. అందుకు సంబంధించిన గాసిప్స్ ను .. మీమ్స్ ను నేను చూశాను. తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అందువలన తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.