Begin typing your search above and press return to search.

'చిల్ మారో'.. నితిన్ చించేశాడుగా

By:  Tupaki Desk   |   1 Jun 2022 5:39 AM GMT
చిల్ మారో.. నితిన్ చించేశాడుగా
X
యంగ్ టాలెంటెడ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా మూవీ 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'. గ‌త ఏడాది రంగ్ దే, వంటి చిత్రంతో ఫ‌ర‌వాలేద‌నిపించిన నితిన్ ఆ త‌రువాత చేసిన 'మాస్ట్రో'తో ఫ్లాప్ ని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'అంధాదున్' ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగులో ఆశించిన విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన నితిన్ ఈ సారి ఎలాగైనా గ‌ట్టిగా కొట్టాల‌ని ఫిక్స‌యి కొత్త ద‌ర్శ‌కుడితో చేస్తున్న మూవీ 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'.

నితిన్ ని స‌రికొత్త పంథాలో ఆవిష్క‌రిస్తున్నారు. ఇందులో నితిన్ ఐఏఎస్ అధికారిగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. హోమ్ బ్యాన‌ర్ శ్రేష్ట్ మూవీస్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా ఎం.ఎస్‌. రాజ‌శేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నితిన్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీని ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేఫ‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేసింది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ రిపోర్ట్ పేరుతో విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. చాలా రోజుల త‌రువాత నితిన్ మ‌ళ్లీ స‌రికొత్త పాత్ర‌లో మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ గా 'చిల్ మారో' అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ విడుద‌ల చేశారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని నితిన్‌, కేథ‌రిన్ ల‌పై బీచ్ నేప‌థ్యంలో చిత్రీక‌రించారు.

మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అందించిన బీట్స్‌, నితిన్ ఎన‌ర్జిటిక్ మూవ్ మెంట్స్ తో ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలిచేలా వుంది. 'భీష్మ‌' త‌రువాత మ‌రోసారి నితిన్ అదిరే స్టెప్పుల‌తో చిల్ అవుతూ చించేశాడు. కృష్ణ చైత‌న్య సాహిత్యం అందించిన ఈ పాట‌ని న‌కాష్ అజీజ్‌, సంజ‌న క‌ల్మాంజే య‌మ జోష్ గా ఆల‌పించి మ‌రింత జోష్‌ని యాడ్ చేశారు. ఈ పాట‌లో నితిన్ మ‌రింత స్టైలిష్ గా క‌నిపించి త‌న‌దైన స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. కేథ‌రిన్ మాత్రం చాలా హాట్ గా క‌నిపించింది.

'ఉప్పెన‌' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్నీ మూవీ మాచ‌ర్ల నేప‌థ్యంలో సాగే పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కింది. నితిన్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన మేకోవ‌ర్ తో న‌టిస్తున్న ఈ మూవీతో హీరో నితిన్ మ‌ళ్లీ మాస్ హీరోగా ఆక‌ట్టుకోవాల‌ని, స‌రికొత్త ఇమేజ్ ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. సినిమా కూడా నితిన్ కు ఈ సారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించేలానే క‌నిసిస్తోంద‌ని అత‌ని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో చెబుతున్నారు.