Begin typing your search above and press return to search.
మాచారం` నియోజకవర్గంలో నితిన్
By: Tupaki Desk | 17 Sep 2021 2:30 PM GMTయూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా నటించిన `మాస్ట్రో` నేడు ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా టాక్ సంగతి పక్కనబెడితే ఇంతలోనే యూత్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ సహా..ఆ సినిమాకు సంబంధించిన లాంచింగ్..టైటిల్ పోస్టర్..ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి షాకిచ్చాడు. మాస్ట్రో రిలీజ్ కు ముందే ఈ విషయాన్ని రివీల్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు.
సినిమా టైటిల్ `మాచర్ల నియోజకవర్గం`. టైటిల్ ని బట్టే ఇది పోలిటికల్ థ్రిల్లర్ అని తేలిపోయింది. అయితే కథ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. సినిమా కథ అంతా మాచర్ల నియోజక వర్గం చుట్టూనే తిరుగుతుందిట. పూర్తిగా పొలిటికల్ నేపథ్యం సినిమా కాబట్టే నేరుగా నియోజకవర్గం అనే పదాన్ని యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో ముఖ్యమంత్రి పాత్రతో పాటు మంత్రులు..ఎమ్మెల్యేల పాత్రలు ఉంటాయట. అయితే కథ మాత్రం ప్రస్తుత రాజకీయాలకు ఎంత మాత్రం సంబంధం లేదని.. పూర్తిగా ఓ కొత్త కథ కథనాలతో సాగుతుందని నితిన్ తెలిపారు. పూర్తిగా కమర్శియల్ ఫిక్షన్ స్టోరీ అని అన్నారు. తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ అవుతుందని ధీమా వ్యక్తం చేసారు. తొలిసారి రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకోవడం ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందన్నారు. అలాగే గతంలో పవర్ పేట అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకూ సెట్స్ కు వెళ్లలేదు. ఈ నేపథ్యంతో దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
ఇది పొలిటికల్ స్టోరీనే. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ని ఆపేసినట్లు తెలిపారు. అంటే ఆ కథకు..ఈ కథకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. అలాగే మాస్ట్రోలో ముందుగా నయనతారను హీరోయిన్ గా అనుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజముందని అన్నారు. నయన్ కూడా నటించడానికి అంగీకరించారుట. కానీ చివరి నిమిషంలో ఆమెకు కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో కుదర్లేదరన్నారు. ఈ నేపథ్యంలో తమన్నాను తీసుకున్నాం. కానీ ఎవరి ప్రత్యేకత వారికుంది. తమన్నా ఫ్రెష్ ఫీల్ ని తీసుకొచ్చిందని నితిన్ తెలిపారు.