Begin typing your search above and press return to search.
పిస్టల్ తో భార్యను భయపెడుతున్న నితిన్..!
By: Tupaki Desk | 5 Nov 2021 7:32 AM GMTకరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల ప్రభావం నుంచి బయటపడుతున్న ప్రజలు.. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వెలుగులు నింపే దీపాల పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వదులుతూ, అభిమానులకు శుభాకాంక్షలు అందజేశారు. అలానే తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి జరుపుకున్న పండుగ విశేషాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. యూత్ స్టార్ నితిన్ కూడా తన భార్యతో కలిసి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకున్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నితిన్ సతీమణి షాలిని ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది. నేను సేఫ్ గా ఉన్నట్లు అనిపించడం లేదు అని కామెంట్ పెట్టింది. ఇందులో నితిన్ తన భార్యను పిస్టల్ తో బెదిరిస్తున్నాడు.. దీంతో శాలిని కళ్ళూ చెవులు మూసుకుంటూ కనిపిస్తోంది. పిస్టల్ గురి పెడితే భయపడాలి కానీ.. చెవులు మూసుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా?. ఎందుకంటే అది దీపావళి నాడు పిల్లలు ఆడుకునే తుపాకీ కాబట్టి. పండుగ రోజు చిన్న పిల్లాడిగా మారిన నితిన్.. రీల్ గన్ తో తన అర్థాంగిని బెదిరిస్తున్నాడన్నమాట.
'భీష్మ' డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ వీడియోపై స్పందిస్తూ.. నెక్స్ట్ ఒలింపిక్స్ లో మనకు గోల్డ్ మెడల్ గ్యారెంటీ అని కామెంట్ పెట్టారు. నితిన్ భార్య శాలిని పోస్ట్ చేసిన ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'మాస్ట్రో' సినిమాతో అలరించిన నితిన్.. ''మాచర్ల నియోజకవర్గం'' అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ప్రముఖ ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ (ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.