Begin typing your search above and press return to search.

నిత్యా మీనన్.. తెలుగోళ్లకు మాత్రమే

By:  Tupaki Desk   |   10 April 2016 9:30 AM GMT
నిత్యా మీనన్.. తెలుగోళ్లకు మాత్రమే
X
అవ్వడానికి మలయాళ అమ్మాయే అయినా.. తెలుగులో తన తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది నిత్యామీనన్. ఏదో ఆషామాషీగా కాకుండా ‘అలా మొదలైంది’లో తెలుగమ్మాయిలా పర్ఫెక్టుగా డబ్బింగ్ చెప్పింది నిత్య. అంతే కాదు.. ఆ సినిమాలో స్వయంగా ఓ పాట కూడా పాడింది. మళ్లీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో సైతం ఆమె మరోసారి తన గళాన్ని విప్పింది. ఇప్పుడు ‘24’ కోసం ఇంకోసారి నిత్య గాయని అవతారం ఎత్తింది.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో తాను పాట పాడటంపై ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ఐతే ఈ పాట మన తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కావడం విశేషం. చంద్ర‌బోస్ రాసిన లాలీజో.. అంటూ సాగే పాట‌ని తెలుగులో నిత్యా పాడింది. ఐతే తమిళంలో మాత్రం నిత్యకు ఛాన్సివ్వలేదు రెహమాన్. ఇదే పాట‌ని త‌మిళంలో శ‌క్తిశ్రీ గోపాల‌న్ పాడింది.

‘24’ పాటలు సోమవారమే విడుదల కాబోతున్నాయి. ఉదయం చెన్నైలో తమిళ ఆడియో వేడుక నిర్వహించి.. సాయంత్రానికి హైదరాబాద్‌ లో తెలుగు ఆడియోను విడుదల చేయబోతున్నారు. విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహించిన ‘24’లో సూర్య మూడు రకాల భిన్నమైన పాత్రలు చేయడం విశేషం. సూర్య సరసన సమంత - నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు నటుడు అజయ్ కీలక పాత్ర పోషించాడు. మేలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.