Begin typing your search above and press return to search.
ప్చ్.. ఆ హీరోయిన్ బర్తడే ఇవాళ కాదు
By: Tupaki Desk | 15 Oct 2016 8:19 AM GMTఈరోజు పొద్దున్నుండి దాదాపు తెలుగు సెలబ్రిటీలు.. తెలుగు ప్రేక్షకులు ఒక హీరోయిన్ కు తెగ బర్త్ డే విషెస్ చెప్పేస్తున్నారు. తెలుగు సినిమాల ప్రధానుడు.. ఫాథర్ ఆఫ్ తెలుగు సినిమా అనే ఖ్యాతిని పొందిన ఫిలిం మేకర్.. రఘుపతి వెంకయ్య నాయుడు కు కూడా విషెస్ చెప్పని మన సెలబ్రిటీలు.. మల్లూ బ్యూటి నివేదా థామస్ కు మాత్రం విషెస్ తో పూలు కురిపించారు.
దాదాపు చాలా మీడియా సంస్థలతో పాటు.. జర్నలిస్టులు.. సెలబ్రిటీలు.. అభిమానులు.. అందరూ నివేదా థామస్ కు బర్తడే విషెస్ అంటూ హడావుడి చేశారు. అయితే నివేదా థామస్ వికీపీడియా పేజీలో అసలు బర్త్ డే కాలమ్ లేదు కాని.. గూగుల్ సెర్చ్ లో మాత్రం అక్టోబర్ 15 అని చూపిస్తోంది. అందుకే మనోళ్లు ఇంత హడావుడి చేయడం. దీనిపై తాయితీగా స్పందించిన నివేదా థామస్ మాత్రం.. ''హేయ్.. పొద్దున్నుండి అందరూ ఒకటే బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాని నా పుట్టినరోజు ఇవాళ కాదబ్బా. నవంబర్ 2న నేను పుట్టాను'' అంటూ నిజానికి చాలా నెమ్మదిగా రివీల్ చేసింది.
అదండీ మన పరిస్థితి. పోతే ఒక్కసారి అదే వికిపీడియాకో లేదా గూగుల్ సెర్చ్ కో వెళ్ళి ఓసారి రఘుపతి వెంకయ్య నాయుడు అంటే ఎవరో తెలుసుకోండి. కనీసం రఘుపతి వెంకయ్య అవార్డు అంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డును అందుకున్నప్పుడైనా ఆయన గురించి కొద్దోగొప్పో జనాలు తెలుసుకునేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/