Begin typing your search above and press return to search.

నేను పవన్ చెల్లిని కాదు బాబోయ్

By:  Tupaki Desk   |   20 Dec 2016 7:50 AM GMT
నేను పవన్ చెల్లిని కాదు బాబోయ్
X
నాని తో కలిసి టాలీవుడ్ అరంగేట్రం చేసింది నివేదా థామస్. జెంటిల్మన్ మూవీలో తన యాక్టింగ్ ట్యాలెంట్ తో టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరైపోయింది. రీసెంట్ గా ఈమె పవన్ కళ్యాణ్ మూవీలో ఎంపికైందంటూ వార్తలు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి రూమర్స్ కు హీరోయిన్లు పెద్దగా రియాక్ట్ కారు. కానీ.. నివేదా థామస్ కు మాత్రం రియాక్షన్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే.. పవర్ స్టార్ కి చెల్లిగా నివేదా థామస్ నటించనుందంటూ పుకార్లు షికార్లు చేసేశాయి. కోలీవుడ్ హిట్ మూవీ వేదాలంను తెలుగులో రీమేక్ చేయనున్నాడు పవన్. తమిళ దర్శకుడు ఆర్ టీ నేసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా.. ఈ మూవీ చెల్లెలి సెంటిమెంట్ చుట్టూ తిరుగుతూ ఉండే హై లెవెల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ. ఆ చెల్లి పాత్రే నివేద చేస్తోందన్నది టాక్. నేను పవన్ కళ్యాణ్ కి చెల్లెలుగా నటించడం లేదు ఖరాఖండీగా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ హీరోయిన్ కి.

దీంతో నివేదా సన్నిహితుల నుంచి ఓ క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ త్వరలో చేయనున్న వేదాళం రీమేక్ లో నివేదా థామస్ నటించడం లేదని చెప్పేశారు. నివేదా థామస్ ను చెల్లెలు పాత్ర కోసమే కాదు.. అసలు ఏ రోల్ కోసం కూడా అప్రోచ్ కాలేదని తేల్చి చెప్పింది నివేదాకు చెందిన టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/