Begin typing your search above and press return to search.
రేంజ్ కు మించి డిమాండ్ చేస్తోందా?
By: Tupaki Desk | 6 Sep 2019 5:05 AM GMTశ్రీవిష్ణు మెంటల్ మదిలోతో పరిచయమై అటు లుక్స్ పరంగానూ టాలెంట్ పరంగానూ ఆకట్టుకున్న నివేత పేతురాజ్ కెరీర్ ఆశించినంత వేగంగా అయితే సాగడం లేదు. అందం విషయంలోనూ ఈ బ్యూటీ ఎవరికి తీసిపోదు. ఈ ఏడాది బ్రోచేవారెవరురా - చిత్రలహరిలతో చెప్పుకోదగ్గ విజయాలను తన సొంతం చేసుకున్న నివేతకు చాలా ఆఫర్స్ రెమ్యునరేషన్ కారణంగా వెనక్కు వెళ్ళిపోతున్నాయని ఫిలిం నగర్ గాసిప్. దాని ప్రకారం కేవలం 20 రోజుల కాల్ షీట్స్ కు సైతం ఈ అమ్మడు సుమారు 70 లక్షల దాకా డిమాండ్ చేస్తోందట. ఏ లెక్క చూసుకున్నా ఇది చాలా పెద్ద మొత్తం.
ఒకవేళ పూజా హెగ్డే లాగా టాప్ రేంజ్ కు వెళ్ళిపోయి ఆపై డిమాండ్ చేస్తే అందులో పాయింట్ ఉందనుకోవచ్చు. కానీ నివేత ఇంకా మొదటి స్టేజిలోనే ఉంది. అప్పుడే ఇంత మొత్తం అంటే నిర్మాతలకు భారమే కదా. ఈ కారణంగానే విజయ్ దేవరకొండ -క్రాంతి మాధవ్ ల కాంబోలో రూపొందుతున్న మూవీ చేజారిందట. తను వద్దనుకున్నాకే ఇంకో హీరోయిన్ ని ఎంపిక చేసుకుని షూటింగ్ చేసేశారు. డిస్కో రాజాకు సైతం తొలుత అడిగితే పారితోషికం దగ్గరే పేచీ రావడం వల్ల అది కాస్తా నభ నటేష్ కు వెళ్లినట్టుగా చెబుతున్నారు.
అంతే కాదు గీత ఆర్ట్స్ ప్లాన్ చేసిన మరో మూవీ సైతం ఇదే తరహాలో చేజారినట్టు తెలిసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం కరెక్టే కానీ ఉన్న దీపం ఆరిపోకుండా చూసుకోవడం చాలా అవసరం. నివేత ఇది గుర్తించడం లేదని సదరు చర్చల సారాంశం. బ్యూటీకి దేనికీ లోటు లేకపోయినా ఇలా సొమ్ము దగ్గర రాజీ పడకపోతే ఇప్పుడున్న పోటీని తట్టుకుని నిలవడం కష్టమే.