Begin typing your search above and press return to search.
హీరోయిన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. అందులో ఏమొచ్చిందో తెలుసా?
By: Tupaki Desk | 24 Jun 2021 10:30 AM GMTరెస్టారెంట్ ఫుడ్ ను ఆల్మోస్ట్ అందరూ లైక్ చేస్తారు. అందులోని ఫ్లేవర్స్, ఘుమఘుమలే ఇందుకు ప్రధాన కారణం. ఆ సువాసన వచ్చిందంటే.. మనసు మైమరచిపోతుంది. వెంటనే ఓ పట్టు పట్టాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు మాత్రం ఎవ్వరూ చూడాలనుకోని నిజం ఉంటుంది. అదే అపరిశుభ్రత!
దీన్ని నేరుగా చూసింది హీరోయిన్ నివేదాపేతురాజ్. పాపం.. ఎంత ఆకలిగా ఉందో ఏమో.. ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. చెన్నైలోని ఓ రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిందీ కోలీవుడ్ బ్యూటీ. ఎంతో ఇష్టంగా తినడానికి ప్యాకెట్ ఓపెన్ చేయగా.. అందులో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది.
దీంతో.. అవాక్కైపోయింది. వెంటనే.. సదరు రెస్టారెంట్ ను ట్యాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. హోటళ్లు కనీసం శుభ్రత పాటించట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘ఇటీవల కాలంలో హోటళ్లు సరిగ్గా పరిశుభ్రతను పాటించట్లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నేను ఆర్డర్ చేసిన బోజనంలో బొద్దింక వచ్చింది. ఈ హోట్ల్ వాళ్లు సరిగ్గా నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. కొనుగోలుదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై భారీగా జరిమానా విధించాలి’’ అని పోస్టు చేసింది నివేదా.
ఇది.. తరచూ వెలుగు చూస్తున్న సమస్యనే. సెలబ్రిటీల విషయం కాబట్టి బయటకు వచ్చిందిగానీ.. నిత్యం ఎవరో ఒకరు ఇలాంటి విషయాల్లో బాధితులుగానే ఉంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం, లంచాలు తీసుకొని సైలెంట్ గా ఉండటం వల్లనే ఈ పరిస్థితులు వస్తున్నాయని వినియోగదారులు మండిపడుతున్నారు.