Begin typing your search above and press return to search.
కరోనా మీద చివరికి క్లారిటీ ఇచ్చింది
By: Tupaki Desk | 12 April 2021 4:18 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై నటి నివేదా థామస్ స్పందించారు. వకీల్ సాబ్ చిత్రం ముగ్గురు యువతుల చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. అందులో మెయిన్ క్యారెక్టర్ గా ఉన్నారు నివేదా.
అయితే.. సినిమా రిలీజ్ కు ముందే కరోనా బారిన పడ్డారు. దీంతో.. ప్రీ-రిలీజ్ ఈ వెంట్ కు సైతం రాలేకపోయారు. ఇప్పుడు సినిమా సక్సెస్ గురించి ఆమె మాట్లాడారు. వకీల్ సాబ్ సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు.
‘మనం చాలా సినిమాలు చూస్తుంటాం. కానీ, అందులో కొన్ని మాత్రమే మన కోసం చేసినవి అని అనిపిస్తుంటాయి. వకీల్ సాబ్ అలాంటిదే. అభిమానుల ఆనందం.. సినిమా వసూళ్లు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.’ అన్నారు నివేదా.
పవన్ సార్ తో నటించడం చాలా స్పెషల్ గా అనిపించిందని చెప్పారు. ఇక, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. సినిమా ప్రమోషన్స్ సమయంలోనే తనకు కరోనా రావడం బాధించిందని, ప్రస్తుతం కోలుకున్నానని చెప్పారు. సినిమాను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.